రామ్ చరణ్ ను అవమానిస్తూ ఎన్టీఆర్ గ్రేట్ అన్న నటి అన్నపూర్ణ?

దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR.ఈ సినిమా ఈ ఏడాది మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో ఇద్దరూ టాలీవుడ్ టాప్ హీరోలు నటించడంతో ఈ ఇద్దరు హీరోలు అభిమానుల మధ్య పెద్ద వార్ నడిచింది.ఇందులో రామ్ చరణ్ కు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చి ఎన్టీఆర్ ను తక్కువ చేసి చూపించారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈ సినిమా విడుదల చాలా రోజులైనాప్పటికీ ఇంకా ఈ విషయం గురించి తరచూ వార్తలు వస్తూనే ఉంటాయి.

ఇకపోతే తాజాగా సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమంలో కూడా ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది.ఈ కార్యక్రమానికి సీనియర్ నటీమణులు హాజరయ్యారు. ఈ క్రమంలోని అన్నపూర్ణమ్మని ప్రశ్నిస్తూ మీరు ఏ హీరో యాక్టింగ్ చూసినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యారని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అన్నపూర్ణమ్మ సమాధానం చెబుతూ ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి తాను ఎంతో గర్వపడ్డానని తెలిపారు.

ఇలా అన్నపూర్ణమ్మ సమాధానం చెప్పేసరికి సుమ మరి రామ్ చరణ్ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించగా ఉంటాడు పక్కన అంటూ ఆయనని కూరలో కరివేపాకుల దారుణంగా తీసి పడేశారు.ఈ విధంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది రామ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున ఈమెపై దారుణమైన కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.ఈ వీడియోని ఎన్టీఆర్ అభిమానుల సైతం వివిధ గ్రూపులలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.