ఆది ఏంటి ఒకేసారి ఆ నటిని అంత మాట అనేసారు.. నా లుంగీ అంటూ పరువు మొత్తం తీసాడుగా!

శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా ఎంతో మంది బుల్లితెర నటీనటులు సీనియర్ నటిమనులు అలాగే జబర్దస్త్ కమెడియన్స్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.ఇకపోతే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో భాగంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సీనియర్ నటీమణులు హాజరు కావడంతో హైపర్ ఆది మాత్రం అసలు ఈ కార్యక్రమానికి ఆంటీలను ఎందుకు తీసుకువస్తున్నారు అంటూ ఫైర్ అయ్యాడు. ఇకపోతే నడుం మీద పుట్టుమచ్చతో ఉన్నటువంటి అమ్మాయి కోసం ఈయన వెతుకుతూ తన సౌందర్యలహరి ఎక్కడ ఉందా అని కార్యక్రమంలో ఉన్న అందరి నడుము పై పుట్టుమచ్చలు వెతుకుతూ కనిపిస్తారు.

ఈ విధంగా హైపర్ ఆది కార్యక్రమంలో ఉన్నటువంటి వర్ష, ఐశ్వర్య, రీతు వంటి సెలబ్రిటీల దగ్గరకు వెళ్లి తనదైన స్టైల్ లో నడుము పై పుట్టుమచ్చ వెతుకుతాడు. అదే సమయంలోనే సీనియర్ నటి మలక్ పేట్ శైలజ ఆది వద్దకు వచ్చి నా నడుము పై పుట్టుమచ్చ ఉందేమో చూడు అంటూ రావడంతో వెంటనే హైపర్ ఆది నీ నడుము పై పుట్టుమచ్చను నేను కాదు కదా కనీసం నా లుంగీ కూడా చూడదు అంటూ తనపై దారుణమైన పంచ్ వేశాడు.

ఇలా హైపర్ ఆది ఒక్కసారిగా తనపై పంచ్ వేయడంతో అందరూ నవ్వేశారు. ఇలాగే మరో సందర్భంలో కూడా మలక్ పేట్ శైలజ గురించి హైపర్ ఆది మాట్లాడుతూ మిమ్మల్ని నేను కాదు కదా.. మన మేనేజర్ కూడా చూడరు అంటూ దారుణంగా ఆమెను అవమానించారు. అయితే ఇదంతా కూడా కేవలం స్కిట్ కోసమే అనే విషయం మనకు తెలిసిందే. ఇలా ప్రతివారం హైపర్ ఆది ఏదో ఒక విభిన్నమైన కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు.ఇక గత వారం జరిగిన ఎపిసోడ్ లో భాగంగా సీనియర్ నటిమలు కలిసి హైపర్ ఆదికి చుక్కలు చూపించడంతో ఈయన అసలు ఈ కార్యక్రమానికి ఆంటీలను ఎందుకు తీసుకువస్తారు అంటూ ఫైర్ అయ్యారు.