కుర్రకారుని మాయలో పడేసింది పూజా!

కుర్రకారుని మాయలో పడేసింది పూజా!

 
డీజేలో బికినీ షోతో కుర్రకారుని మాయలో పడేసిన పూజా హెగ్డే టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. స్టార్ హీరోలకు సింగిల్ ఆప్షన్  పూజా అంటే అతిశయోక్తి కాదు.
 
వీర రాఘవకు సొంతంగా డబ్బింగ్ చెప్పిన ఈ బ్యూటీ, త్వరలో ఓ పాటేసుకోబోతోందట. అదీ త్రివిక్రమ్ సినిమా కోసమే. అల్లు అర్జున్ తాజా ప్రాజెక్టులో పూజా హీరోయిన్. ఇప్పటికే హైదరాబాద్‌లో మొదలైన రెండో షెడ్యూల్‌లో జాయినైంది. పాట పాడాలన్న పూజ కోరికను ఓ ఇంటర్వ్యూలో చదివిన తమన్, ఇలా ఆమె కోరిక తీర్చబోతున్నాడట.
 
పూజ హస్కీ వాయిస్‌లో ఓ గమ్మత్తుంటుంది. స్పెషల్ ట్యూన్ ఒకటి కంపోజ్ చేసిన తమన్ త్వరలోనే రికార్డు చేయనున్నట్టు సమాచారం. అయితే, డ్యూయెట్టా? సోలోనా? అన్నది తెలియాల్సివుంది. ఇటు ప్రభాస్ ప్రాజక్టు, అటు బాలీవుడ్‌లో హౌస్‌ఫుల్- 4 ప్రాజెక్టు.. సౌత్, నార్త్‌లో పూజ బిజీ అయిపోయింది.