టాలీవుడ్ యూత్ లో ఫేజ్ మారుతోంది. ఇన్నాళ్లు పెళ్లికి నోనో అన్నవాళ్లే లాక్ డౌన్ లో ఎస్ అనేస్తున్నారు. పలువురు హీరోల పెళ్లిళ్లపై ఇటీవల ఆసక్తికర చర్చ సాగింది. అలాగే సాహో ఫేం దర్శకుడు సుజీత్ ప్రవల్లికా అనే డెంటిస్ట్ కం స్క్రీన్ ప్లే రచయితను పెళ్లాడబోతున్నాడని ఇటీవల ప్రచారమైంది. త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు వెల్లడైంది.
నిశ్చితార్థం జూన్ 10 న జరగాల్సి ఉంది. ఇది లవ్ కమ్ ఎరేంజ్డ్ వివాహం. తాజా సమాచారం ప్రకారం.. నిశ్చితార్థం హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లో జరుగుతుంది. శుభ ముహూర్తం జూన్ 10 ఉదయం 9 గంటలకు నిశ్చయించారు. లాక్డౌన్ కారణంగా, యువ జంటను ఆశీర్వదించడానికి కుటుంబ సభ్యులు .. ఇరువైపుల స్నేహితులతో సహా 50 మంది అతిథులు మాత్రమే పాల్గొంటారు.
రన్ రాజా రన్ తర్వాత సాహో లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించిన సుజీత్ కి ప్రవళ్లిక చిరపరిచితురాలు. తనతో కలిసి స్క్రీన్ ప్లే కోసం వర్క్ చేసింది. ఆ క్రమంలోనే స్నేహం కాస్తా ప్రేమగా మారిందని తెలుస్తోంది. సాహో తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఓ రీమేక్ చిత్రానికి కమిటయ్యాడని ఇటీవల ప్రచారమైంది. దానికి సంబంధించిన అప్ డేట్ రావాల్సి ఉంది.