‘కేజీయఫ్‌ 2’ లో నటించాలని ఉందా?

కన్నడ,తెలుగు,తమిళ, హిందీ భాషల్లో సంచలన విజయం సాధించిన భారీ చిత్రం కేజీయఫ్‌. యంగ్ హీరో యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్‌ పనులు ప్రారంభించారు. చిత్రయూనిట్‌. తొలి భాగం షూటింగ్ సమయంలోనే కేజీయఫ్‌ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించిన చిత్రయూనిట్ తాజాగా కేజీయఫ్2 షూటింగ్‌ ప్రారంభించారు.

అ’కేజీయఫ్ 2′ లో నటీనటులు కోసం ఆడిష‌న్స్‌ జరుగుతున్నాయి. ఇందులో పాల్గొన‌వ‌చ్చని చిత్రయూనిట్ ఓ పోస్టర్‌ ద్వారా తెలియచేశారు. 8 నుండి 16 సంవ‌త్సరాల వ‌య‌స్సున్న పిల్లలు, 25 సంవత్సరాల పైబ‌డిన పురుషులు కావాలని ఈ ప్రకటన సారాంశం. కానీ ఆడిష‌న్‌కి వ‌చ్చే ముందు కనీసం నిమిషం నిడివి ఉన్న ఏదైనా డైలాగ్‌ని నేర్చుకొని రావాల‌ని షరతు పెట్టారు.

ఈ ఆడిషన్స్‌ బెంగళూరులోని జీఎమ్‌ రిజాయిజ్‌లో ఏప్రిల్‌ 26న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు జరగబోతోంది. ఆసక్తి ఉన్నవాళ్లు డైలాగ్ నేర్చుకుని వెళ్లచ్చు. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌, ఉపేంద్ర లు ‘కేజీయఫ్‌ 2’ లో కనిపించబోతున్నారు. కేజీయఫ్ తొలి భాగం 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో సీక్వెల్‌ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు.