మీ స్పెర్మ్ నాకు ఇవ్వగలవా? హీరోని పబ్లిక్ గా అడిగేసింది

సింగర్ గానే కాకుండా మంచి నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా.  బాలీవుడ్‌లో ఆయుష్మాన్‌ నటించిన తొలి చిత్రం ‘విక్కీ డోనర్‌’. తొలి సినిమాతోనే ఆయుష్మాన్‌కి మంచి గుర్తింపు వచ్చింది. దీనిని తెలుగులో ‘నరుడా డోనరుడా’ టైటిల్‌తో రీమేక్‌ చేశారు. ఆయుష్మాన్‌ పాత్రలో సుమంత్‌ నటించారు.

ఆ తర్వాత ఆయన నటించిన ‘బరైలీ కీ బర్ఫీ’, ‘శుభ్‌ మంగళ్‌ సావధాన్‌’ చిత్రాలు వరుస హిట్లు అందుకున్నాయి. దాంతో ఆయన ఎక్కడికి వెళ్లినా జనం గుర్తుపడుతున్నారు. అయితే అదే ఆయనకు ఇప్పుడు సమస్యలు తెచ్చిపెడుతోంది. విక్కీ డోనర్ హీరోగా ఆయన్ని గుర్తు పట్టి చిత్రంగా జనం మాట్లాడుతున్నారు.

ఈ మధ్యన ఆయన ఓ మాల్ కు తల్లితో కలిసి వెళితే… ఓ అమ్మాయి గట్టిగా అరుస్తూ… “మీ స్పెర్మ్ నాకు ఇవ్వగలరా?” అంది. అది చూసిన తల్లి ..కంగారుపడి..ఏంటిరా ఆ అమ్మాయి అంటోంది..నాకు ఏమీ అర్దం కావటం లేదు..నువ్వేం బయిట చేస్తున్నావో అందిట. తన తల్లితో ఉన్నప్పుడు ఓ అమ్మాయి అలా మాట్లాడటం ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించండి అంటున్నారు. ఇంకోసారి ఓ గే కాస్టింగ్ కోచ్ తనని తన మేల్ జెనిటికల్స్ తీసి చూపించమన్నాడని, తను నో చెప్పటంతో తిట్టి పోసాడని, అసలు ఇలాంటి ఎక్సపీరియన్స్ లు జీవితంలో ఎదురవ్వుతాయని ఎప్పుడూ ఊహించలేదని చెప్తూ బాధపడిపోయాడు.