సీటీమార్` గోపీకి మ్యాసివ్ కంబ్యాక్ అవుతుందా?

ట్యాలెంట్ ఉన్నా అదృష్టం క‌లిసి రాక‌పోతే ఎలా ఉంటుందో గోపిచంద్ ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. గ‌త కొన్నేళ్లుగా అత‌డిని దుర‌దృష్టం వెంటాడుతోంది. 2019 అస‌లే క‌లిసి రాని సంవ‌త్స‌రంగా మిగిలింది. అందుకే 2020 పైనే అత‌డి ఆశ‌ల‌న్నీ.. ప్ర‌స్తుతం గోపీచంద్‌ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్‌ నంది దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు `సీటీమార్‌` అనే టైటిల్ ను ఖాయం చేశార‌ని తెలుస్తోంది.

భారీ యాక్షన్ దాంతో పాటే ఎమోష‌న‌ల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా విజువ‌ల్ వండ‌ర్ గా ఉండబోతుందట. యుట‌ర్న్ ఫేం శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి తాజా ప్ర‌య‌త్నం ఏమేర‌కు స‌ఫ‌ల‌మ‌వుతుంది? అన్న‌ది చూడాలి. ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ లేడీ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా న‌టిస్తోంది.