దేశభక్తి నేపథ్యంలో జన గణ మన
తన డ్రీమ్ ప్రాజెక్ట్, `జన గణ మన`ను పూరి జగన్నాథ్ అధికారికంగా ప్రకటించి మూడేళ్లు అయ్యింది. ఇన్నాళ్లు సైలెంటుగా ఉన్న ఆయన ఇటీవలే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళుతున్నానని పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కిస్తానని ప్రకటించారు. అయితే ఇంతకుముందే మహేష్ కథ విని రిజెక్ట్ చేశారు. కానీ అతడితో మరోసారి చర్చలు సాగించే వీలుందని తెలుస్తోంది. మహేష్ సహకరిస్తారా లేదా అనేది ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ మోడ్‌లోకి ప్రవేశించిన తర్వాత తెలుస్తుంది.
ఇంతకీ జనగణమన కథాంశం ఎలా ఉండనుంది? అన్నది ఆరా తీస్తే.. పూరి భారతీయ సైన్యం నేపథ్యంలో జన గణ మన కథను సెట్ చేశారని తెలిసింది. ప్రస్తుతం ప్రజల్లో ఇండియా బార్డర్ ఘర్షణ హాట్ టాపిక్ గా మారింది. జనాల మానసిక స్థితిని చూస్తే, ఇలాంటి బ్యాక్‌డ్రాప్ లో బ్లాక్ బస్టర్ కోసం సరైన సెటప్ లాగా ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కరణ్ జోహార్ అండతో `జన గణ మన`ను భారీ స్థాయిలో తెరకెక్కించి బహుళ భాషలలో విడుదల చేయాలని పూరి-చార్మి బృందం భావిస్తున్నారు. ప్రస్తుత సన్నివేశంలో ఇది తెలివైన ఆలోచనే. అయితే మహేష్ అంగీకరించాడా లేదా? అన్నది చూడాలి. ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.