ఆ సెంటిమెంట్ ప‌న‌వుతుందా బాల‌య్యా?

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ స‌మ‌ర‌సింహారెడ్డి, న‌రసింహానాయుడు. ఆ రెండు చిత్రాల‌కు బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బాల‌య్య కెరీర్ బెస్ట్ హిట్స్ అవి రెండూ. ఒక ర‌కంగా బాల‌య్య ఇమేజ్ ని రెట్టింపు చేసిన సినిమాలు కూడా ఇవే. అందుకే ఇప్పుడు మ‌రోసారి బి.గోపాల్ కి బాల‌య్య ఛాన్స్ ఇస్తున్నార‌ని తెలుస్తోంది.

ఓవైపు బోయ‌పాటితో సినిమాకి సిద్ధ‌మైన బాల‌య్య కోసం గోపాల్ ఇప్ప‌టినుంచే క‌థ‌ను వండుతున్నార‌ట‌. స్క్రిప్టు వ‌ర్క‌వుటైతే బోయ‌పాటి త‌ర్వాత వెంట‌నే సెట్స్ కెళ్లే ఛాన్సుంది. ఒక‌వేళ అదే జ‌రిగితే మ‌రోసారి దానిపై నంద‌మూరి అభిమానుల్లో ఎగ్జ‌యిట్ మెంట్ పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే ఇటీవ‌లి కాలంలో ఔట్ డేటెడ్ క‌థ‌ల‌తో సినిమాలు తీస్తున్నారు అంటూ బాల‌య్య‌పై విమ‌ర్శ‌లొస్తున్నాయి. వాటిని అధిగ‌మించే స్క్రిప్టును వ‌ర్క‌వుట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే కే.ఎస్.ర‌వికుమార్ త‌ర‌హాలో విమ‌ర్శ‌లు ఎదుర్కోవడం అన్న‌దానికి చెక్ పెట్టేయ‌గ‌ల‌రు.