మ్యాటర్‌ అయిపోవడం వల్లే ‘జబర్దస్త్‌’మానేసా

మ్యాటర్‌ అయిపోవడం వల్లే ‘జబర్దస్త్‌’మానేసా

ఈటీవిలో ప్రసారమవుతున్న ‘జబర్దస్త్‌’ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ షోతో పాపులర్ అయ్యి వెండితెరపై వెలుగుతున్న వారెంతమందో ఉన్నారు. వాళ్లలో ఒకడు ‘షకలక’శంకర్‌. ‘జబర్దస్త్‌’చేసిన స్క్టిట్ లతో నవ్వించి సినిమా ఆఫర్స్ సంపాదించటమే కాకుండా హీరోగానూ ఎదిగాడు. అయితే, అతనకు మంచి పేరు తెచ్చింది మాత్రం ‘జబర్దస్త్‌’అనే విషయం చెప్పటానికి వెనకాడడు. మరి అలాంటి శంకర్ దాన్ని ఎందుకు మానేయాల్సి వచ్చిందో రీసెంట్ గా ఇలా చెప్పారు.

షకలక శంకర్ మాట్లాడుతూ..‘‘నాలో మ్యాటర్‌ అయిపోవడం వల్లే ‘జబర్దస్త్‌’ మానేయాల్సి వచ్చింది. నేనేదయితే అనుకున్నానో, ఏదైతే చేద్దామని వచ్చానో అవన్నీ అయిపోయాయి. జనాలు చూశారు. కొన్ని సార్లు చేసినవే మళ్లీ రిపీట్‌ చేశా. ‘ఏంటిరా? శంకర్‌ మళ్లీ చేసినవే చేస్తున్నావ్‌’ అని అన్నారు.

ఇలా కాదని,నెక్ట్స్ లెవిల్ లో కొన్ని స్కిట్‌లు రాశా! అవి ఎవరికీ అర్థం కాలేదు. దీంతో అక్కడి నుంచి వచ్చేయాల్సి వచ్చింది. అప్పట్లో నాతో పాటు చేసిన వాళ్లు ఇప్పుడు ఇంకా చేస్తున్నారంటే అది వాళ్ల టాలెంట్‌. ‘జబర్దస్త్‌’ కాకుండా నాకు కనిపించిన ఇంకో మార్గం సినిమా. అందుకే ఇటువైపు వచ్చా’’ అని చెప్పుకొచ్చారు.