మహేష్ సలహా కు ధాంక్స్ :సమంత

సమంత కెరీర్ కు , మహేష్ బాబుకు అవినాభావ సంభందం ఉంది. సమంత తొలి చిత్రం ఏ మాయ చేసేవే నిర్మాత మహేష్ సోదరి మంజుల. ఆ ఒక్క సినిమాతో ఆమె మహేష్ సరసన డైరక్ట్ గా దూకుడు చిత్రంలో ఆఫర్ పట్టేసింది. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఆ రెండు సినిమాలు తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. ఈ రోజున సమంతకు సౌతిండియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వరస పెద్ద ప్రాజెక్టులు అన్ని ఆమె చేతిలోనే ఉన్నాయి.

ఇక మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రంగా మహర్షి ని చేసి, రిలీజ్ కు రెడీ చేసారు. ఈ సందర్బంగా తన కెరీర్ ప్రారంభంలో ఓ మంచి సలహా ఇచ్చి ఎదిగేలా చేసిన మహేష్ కు ఆమె సోషల్ మీడియా సాక్షిగా కృతజ్ఞతలు తెలియచేసింది. మహేష్ భార్య నమ్రత ఆ వీడియోని తన ఇనిస్ట్రగ్రమ్ ఎక్కౌంట్ లో షేర్ చేసింది. ఇంతకీ ఆమెకు మహేష్ ఏం సలహా చెప్పాడంటారా..మీరు వీడియో చూడండి.

ఈ వీడియో బైట్ పంపించినందుకు మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియా ద్వారా సమంతకు ధన్యవాదాలు చెప్పారు.
ఈ మేరకు సమంత వీడియోను షేర్ చేస్తూ.. ”సామ్ నువ్వంటే మా ఫ్యామిలీకి ఎంతో ఇష్టం. సితార మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. ‘మహర్షి’కి శుభాకాంక్షలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చింది.

అలాగే సమంత ..మహర్షి సినిమా టీమ్ కు బెస్ట్ విషెష్ చెప్పింది. మహేష్ కు సైతం ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఇక మహేష్, సమంత కాంబినేషన్ లో దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు రెండూ వచ్చి మంచి విజయం సాధించాయనే విషయం తెలిసిందే.