కంత్రి, భిళ్లా, శక్తి,షాడో చిత్రాలు డైరక్ట్ చేసిన దర్శకుడు మెహర్ రమేష్ ని మర్చిపోవటం కష్టమే. ముఖ్యంగా శక్తి సినిమా డిజాస్టర్ ఆయన కెరీర్ లో పెద్ద మచ్చగా మిగిలిపోయింది. షాడో తర్వాత ఆయన నాలుగైదు ప్రాజెక్టులు పట్టాలు ఎక్కిద్దామని చూసారు కానీ పనవ్వలేదు. అయితే ఆయన ఎప్పుడూ సినిమావాళ్లు, సినిమా పార్టీలలో బిజీగా ఉంటూంటారు. సినిమా మేకింగ్ ని ప్రక్కన పెట్టి మహేష్ ఫ్యామిలీతో ఆయన స్నేహంగా ఉంటూ ముందుకు వెళ్తున్నారు.
తాజాగా ఆదివారం ఆయన ఎఎమ్ బి సినిమాస్ లాంచ్ సమయంలో మహేష్ బాబు ప్రక్కన కనపడి ఫ్యాన్స్ ని కంగారుపెట్టారు. మహేష్, మెహర్ తో చనువుగా ఉండటం చూసి..ఏదన్నా సినిమా ప్లాన్ చేస్తున్నారా అని సోషల్ మీడియాలో పోస్ట్ లు పడ్డాయి. అయితే మహేష్ బాబు ఎట్టి పరిస్దితుల్లోనూ మెహర్ రమేష్ సినిమా చెయ్యరన్నది నిజం.
మెహర్ రమేష్ కూడా తనను తాను మళ్లీ ప్రూవ్ చేసుకుని ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేదాకా మహేష్ దగ్గరకు కథ పట్టుకుని వెళ్లే ధైర్యమూ చెయ్యలేరు. అయితే మహేష్ తో మెహర్ రమేష్ కు అక్కడ కనపడటంతో అంతరార్దం ఏమిటి అనేగా మీ సందేహం.
వాస్తవానికి మెహర్ రమేష్…మెగాస్టార్ చిరంజీవి కు దూరం బంధువు అయితే మెగా హీరోలెవరూ ఆయన్ని ఎంకరేజ్ చేయలేదు. ఎప్పుడూ మహేష్ తోనే ఆయన ఉంటూంటారు. ఆ మధ్యన అమెరికాలో ప్లాన్ చేసిన ఈవెంట్ సైతం మెహర్ రమేష్ తో ముందుకు వెళ్దామనుకున్నదే.
అయితే మహేష్ తో ఇలా చనువుగా ఉండటం వల్ల మెహర్ కు కలిసొచ్చేదేమిటి అంటే..ఆ మధ్యన మహేష్ చేసిన బస్ యాడ్, రియల్ ఎస్టేట్ యాడ్ కూడా మెహర్ రమేష్ తెచ్చిన ప్రాజెక్టేలే అని తెలుస్తోంది. అలా మహేష్ తో స్నేహం మెహర్ కు పనికొస్తోంది. మెహర్, మహేష్ బాబు మొదటి సారి కలిసింది బాబి సినిమా సెట్ పైన. అప్పుడు ఆ మెహర్ డైరక్షన్ డిపార్టమెంట్ లో పనిచేసేవారు.