అచ్చు గుద్దినట్టు ఒకే పోలికలతో ప్రపంచంలో ఏడుగురు ఉంటారని చెబుతుంటారు. ఇప్పటికే పలువురు హీరోల పోలికలతో .. కథానాయికల పోలికలతో బయటి ప్రపంచానికి పరిచయం అయ్యారు. తాజాగా సౌత్ అగ్ర కథానాయిక నయనతారను పోలిన ఓ టిక్ టాక్ స్టార్ వరల్డ్ ఫేమస్ అయిపోయింది.
టిక్ టాక్ సహా షేర్ ఇట్.. వీ చాట్ ఇలా మొత్తం 59 చైనా యాప్స్ ని బ్యాన్ చేస్తున్నామని భారత ప్రభుత్వం ప్రకటించగానే వీటిల్లో పాపులరైన స్టార్లు అంతా `బేర్`మన్నారు. అంతేకాదు.. ఇప్పుడు ఆ టిక్ టాక్ వీడియోలన్నిటినీ ఇన్ స్టా మాధ్యమంలో షేర్ చేసి సంతృప్తి చెందుతున్నారు.
ఆ కోవలోనే అచ్చం నయనతారను పోలిన మిత్వి గిల్ అనే యువతి తన టిక్ టాక్ వీడియోల్ని ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
అచ్చం నయన్ నే దించేసిందిగా..!
నయనతారా.. డూప్ తారా..!!
ఆ ముఖాభియం అచ్చు గుద్దినట్టు దించేసిందిగా నయన్?