అక్కినేని ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో ఆవిడ క్లాస్ దేనికి?
పూణే ఫిలింఇనిస్టిట్యూట్ తరహా బెస్ట్ ఇనిస్టిట్యూట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని ప్రగల్బాలు పలికారు కేసీఆర్- కేటీఆర్ ప్రబుద్ధులు. తద్వారా వినోద పరిశ్రమ రూపురేఖలే మార్చేస్తామని లోకల్ ట్యాలెంటును పెంచి పోషిస్తామని బీరాలు పోయారు. కానీ ఏదీ?
ప్రకటనలు ఘనం.. పనులు శూన్యం!! అన్న చందంగానే ఉంది పరిస్థితి. అయితే హైదరాబాద్ రాజధానిలో సరైన ఫిలింఇనిస్టిట్యూట్ అన్నదే లేదా? అంటే.. ఓ రెండు మూడు ఫిలింఇనిస్టిట్యూట్ ల పేర్లు వినొచ్చు. వీటిలో మధు ఫిలింఇనిస్టిట్యూట్ కి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సంస్థ మద్రాస్ నుంచి హైదరాబాద్ కి టాలీవుడ్ ని తరలించినప్పటి నుంచి మనుగడ సాగిస్తోంది. ఆ తర్వాత అక్కినేని అందగాడు ఏఎన్నార్ స్థాపించిన అక్కినేని ఫిలింఇనిస్టిట్యూట్ (అన్నపూర్ణ కాలేజ్) కి.. దగ్గుబాటి రామానాయుడు ఉండగా డి.సురేష్ బాబు ప్రారంభించిన రామానాయుడు ఫిలింఇనిస్టిట్యూట్ కి అంతో ఇంతో గుర్తింపు ఉంది.
ఆయా సంస్థల్లో చేరి నటన సహా ఫిలింటెక్నాలజీ కోర్సుల్లో డిప్లోమాలు తీసుకునే యువత ఉన్నారు. వీళ్లలోంచి ఎవరు మెరికలు? అన్నది బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువే కానీ.. మధు ఫిలింఇనిస్టిట్యూట్ నుంచి వచ్చిన ఎందరో గొప్ప స్టార్లు.. టెక్నీషియన్లుగా ఎదిగినవాళ్లు ఉన్నారు. ఇక హైదరాబాద్ లో గల్లీ గల్లీలో ఫిలింఇనిస్టిట్యూట్లు నమ్మశక్యం కానివి ఎన్నో. వీటిని నమ్మి ఔత్సాహిక జనం లక్షల్లో మోసపోతున్న సందర్భాలు ఎన్నో.
అదంతా సరే కానీ.. అక్కినేని ఫిలింఇనిస్టిట్యూట్ ప్రతినిధులు ప్రతియేటా ప్రత్యేకించి వార్షికోత్సవ సెలబ్రేషన్స్ చేస్తుంటారు. ఈసారి అలాంటివేవీ ప్లాన్ చేయకపోయినా… స్పెషల్ గెస్టులతో క్లాసులు చెప్పిస్తున్నారు. అన్నపూర్ణ కాలేజ్ లో ప్రఖ్యాత బాలీవుడ్ హీరోయిన్ కం నిర్మాత దియా మీర్జా ప్రత్యేక క్లాస్ తీస్కుంటోంది. ఆమెతో సంభాషణల కోసం ఆగస్టు 1న జాయిన్ అవ్వండి! అంటూ ఇనిస్టిట్యూట్ వాళ్లు పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకే క్లాస్ ఉంటుందట.
-శివాజీ.కె
https://twitter.com/chay_akkineni/status/1288474409687080968