ప్రభాస్ స్వయంవరం ఎప్పుడు అంటూ చిక్కు ప్రశ్న
డార్లింగ్ ప్రభాస్ పెళ్లి నిరంతరం హాట్ టాపిక్. పెదనాన్న కృష్ణం రాజు అబ్బాయ్ పెళ్లి విషయమై ఇప్పటికే కంగారుగా ఉన్నారు. ప్రతిసారీ దాటవేస్తున్న ప్రభాస్ వైఖరిపై సందేహం వెలిబుచ్చుతున్నాడు. ప్రభాస్ రాజు పెద్దమ్మగారైన శ్యామలాదేవి.. అంగీకరిస్తే ఇక లగ్గం పెట్టేయడమే అని చెప్పి ఇప్పటికే రెండేళ్లు అయిపోయింది. బాహుబలి 2 రిలీజ్ ఇంటర్వ్యూల్లో ఆమె ఈ మాట అన్నారు. రెబల్ స్టార్ సైతం అప్పట్లోనే ఇక పెళ్లి ఖాయం అనేసారు. కానీ ఏదీ .. ఇప్పటివరకూ ప్రభాస్ నోట ఆ మాటే లేదు. దీంతో ఇటీవలి కాలంలో అభిమానుల్లోనూ రకరకాల సందేహాలు నిలువనీయడం లేదు.
ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో 16 మిలియన్లకు పైగా ఫాలోవర్లు కలిగి ఉన్న ప్రభాస్ కి ఇదే వేదికపై ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఎదురవుతూనే ఉన్నాయి. 50లక్షల ఫాలోవర్స్ ఉన్న ఇన్ స్టాలోనూ అప్పుడప్పడు ఈ సందేహాలు వ్యక్తం చేసే అభిమానులు ఉన్నారు. ఎఫ్‌బీలో అత్యధికంగా ఫాలో అవుతున్న దక్షిణ భారత హీరోగా.. తెలుగు హీరోగా డార్లింగ్ రికార్డులకెక్కాడు. ఈ సందర్భంగా ఎక్కువమంది ఫ్యాన్స్ అడిగిన ప్రశ్న డార్లింగ్ పెళ్లెప్పుడు? అనేదే.
ప్రభాస్ 20 టైటిల్ `రాధేశ్యామ్` లుక్ లాంచ్ చేసిన ఆరు రోజుల్లోనే 10లక్షల మంది ఫేస్ బుక్ లో యాడయ్యారు. ట్విట్టర్ .. ఇన్ స్టాలోనూ లక్షల్లో అతడిని అనుసరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్న పెళ్లెప్పుడు అనేదే. ఇంతకీ ప్రభాస్ మైండ్ లో ఏం ఉందో? ఓ వైపు తన సహచరుడైన భళ్లాలదేవ రానా ఓ ఇంటివాడైపోతున్నాడు. మిహీక బజాన్ ని పెళ్లాడేందుకు ఈ ఆగస్టులోనే ముహూర్తం ఫిక్స్ చేసుకున్న రానాను చూసి అయినా ప్రభాస్ తొందరపడడేమిటి? ఈ లాక్ డౌన్ లో బోలెడంత తీరిక సమయం చిక్కింది. సరిగ్గా కుదిరేది కదా? అంటూ అడిగేస్తున్నారు. కోటిన్నర మంది ఫేస్ బుక్ ఫాలోవర్స్ లో ప్రభాస్ అంటే మనసుపడే గాళ్స్ శాతమే అధికం. అతడిని పెళ్లాడేస్తామనే కథానాయికలు ఉన్నారు. కనీసం పెళ్లికి స్వయంవరం అయిన ప్రకటించేస్తే అయిపోయేది కదా డార్లింగ్.. అన్న నివేదన కనిపిస్తోంది.