భారత దేశంలో వున్న అతి కొద్దీ మంది గొప్ప దర్శకులలో మణిరత్నం ఒకరు . ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు సంచలన విజయం సాధించాయి . పల్లవి అనుపల్లవితో ఆయన దర్శకుడయ్యారు . ఆ తరువాత మౌన రాగం ,నాయకుడు , గీతాంజలి, రోజా ,బొంబాయి , దళపతి, ఇరువురు ,దిల్ సే ,గురు , రావణ్ , కాదల్ చిత్రాలు అయన ప్రతిభకు నిదర్శనం . ఎంతో మంది నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆయన చేయూత నిచ్చారు , గుర్తింపు గౌరవం తెచ్చారు . ఎవరైనా ఒకప్పుడు, కె. బాల చందర్, బాపు , కె. విశ్వనాథ్ చిత్రాల్లో నటించాలని కలలు కనేవారు . ఇప్పుడు మణిరత్నం చిత్రంలో నటించాలని చాలా మంది హీరోయిన్స్ ఆశాభావంతో వున్నారు . ఆ కోవలోకి తాప్సి చేరింది .
‘ నేను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను . తెలుగులో “ఝుమ్మంది నాదం’ తమిళంలో “ఆడుకాలం” చిత్రాలతో రెండు భాషల్లో పరిచయం అయ్యాను . తెలుగు సినిమా హిట్ అయ్యింది . తమిళ సినిమా అవార్డులను తెచ్చిపెట్టింది . నిజానికి నేను ఎంబీఏ చేసి మార్కెటింగ్ ఫీల్డ్లో వుందామనుకున్నా . సినిమా రంగంలోకి వచ్చాక ఈ సరదా కూడా చూద్దామనుకున్నా , హిందీ సినిమా రంగంలోకి కూడా అడుగు పెట్టాను . అయినా ఓ అసంతృప్తి మిగిలింది ” అని చెప్పింది .
ఏమిటా అసంతృప్తి ? అని అడిగినప్పుడు తాప్సి తన మనసులో మాట బయట పెట్టింది . “ఎప్పటికైనా మణిరత్నం హీరోయిన్ అనిపించుకోవాలి , అదే నా జీవితాశయం ” అని చెప్పింది . తాప్సి కల నెరవేరుతుందో లేదో చూడాలి .