‘వినయ విధేయ రామ’ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పాసెస్ దొరుకు స్దలం !

 

రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఈ రోజు (డిసెంబర్ 27) జరగనున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ జరగబోయే ఈ వేడుకకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ ముఖ్య అతిథిగా హారజరుకాబోతున్నారు. ప్రీ-రిలీజ్ వేడుక వేదికగా సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలో ‘వినయ విధేయ రామ’ ప్రీ-రిలీజ్ వేడుక పాసెస్ కోసం మెగా అభిమానుల హంగామా మొదలైంది. అయితే ఇందుకు ఏర్పాట్లు చేసింది టీమ్. ఫ్యాన్స్ కి పెద్దగా ఇబ్బంది లేకుండా.. ఈ ఫంక్షన్ పాసెస్ హైదరాబాద్ లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్టు (CCT) వద్ద లభిస్తాయని రామ్ చరణ్ టీమ్ ట్వీట్చేసింది. దీంతో మెగా అభిమానులంతా అక్కడికి పరుగులు తీస్తున్నారు.

 

అలాగే ఈ చిత్రం ట్రైలర్ కోసం ప్రత్యేకంగా ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఈ రోజు రాత్రి సరిగ్గా 9గంటలకి ట్రైలర్ ని వదలబోతున్నారు. ట్రైలర్ రిలీజ్ ముహూర్తాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు రామ్ చరణ్. ఈ పోస్టర్ లో గుర్రంపై చరణ్ లుక్ అదిరిపోయింది. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

క్లాస్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ లోని మాస్ యాంగిల్ ని చూపించబోతున్నాడు దర్శకుడు బోయపాటి. చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ నటించింది. వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ.. తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. డి.వి.వి దానయ్య నిర్మించారు.