Vishwaksen: పాగల్ హీరోకి కరోనా పాజిటివ్

Vishwaksen: గతంలో అన్ని సినీ పరిశ్రమలలోను చాలా మందికి కరోనా సోకింది. కొంతమంది కరోనాతో మరణించారు కూడా. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ కరోనా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది. ఇప్పుడు మూడో వేవ్ అంటూ వస్తుంది. ఒక పక్క అందరు వ్యాక్సిన్స్ తీసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు పాటించినా కరోనా ఏదో ఒక రూపంలో వస్తూనే వుంది. మళ్ళీ గత కొన్ని రోజులుగా సెలెబ్రిటీలపై కరోనా పంజా విసురుతుంది. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్ లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి.

తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలోనూ కరోనా కల్లోలం సృష్టి స్తోంది. ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి బారిన చాలా మంది సెలబ్రీటీలు పడగా.. తాజాగా… మరో టాలీవుడ్‌ స్టార్‌ కు కరోనా సోకింది. పాగల్ సినిమా యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ కు తాజాగా కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా హీరో విశ్వక్‌ సేన్‌ తన సోషల్‌ మీడియా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

”నాకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. నిన్న రాత్రి కరోనా పరీక్షల్లో ఈ విషయం బయట పడింది. దీంతో డాక్టర్ల సూచనల మేరకు హోం ఐసోలేషన్‌ లో ఉన్నాను. కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పటికీ… ఈ మహమ్మారి నాకు సోకింది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు, భౌతిక దూరం పాటించండి. బయట అనవసరంగా తిరగొద్దు” అంటూ విశ్వక్‌ సేన్‌ ట్వీట్‌ చేశాడు. కాగా… రెండు రోజుల క్రితం.. హీరో మంచు మనోజ్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

ఫలక్ నామాదాస్, హిట్ సినిమాలతో బాగా గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో విశ్వక్‌సేన్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా తెలియచేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.