తెలుగు నుంచి రీమేక్ అయ్యిన చిత్రాన్ని మళ్లీ తెలుగులోకే డబ్బింగ్ చేయటం అంటే వింత విషయమే. ఇప్పుడు అలాంటి వింతను విశాల్ మనకు చూపించనున్నారు.
గతంలో పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కంబినేషన్లో వచ్చిన “టెంపర్” మంచివిజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో సక్సస్ కొట్టిన టెంపర్ ని రణ్ బీర్ సింగ్ హిందీలో “సింబా” పేరుతొ చేయగా అక్కడకూడా సూపర్ హిట్ ఐయ్యింది. ఇటీవల విడుదలైన విశాల్ నటించిన “టెంపర్” తమిళ రీమేక్ “అయోగ్య” కూడా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. పోలీస్ ఆఫీసర్‌గా విశాల్ తన విశ్వరూపం చూపించాడు. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రానికి ఫ్యాన్స్ నుంచి మాత్రమే కాక విమర్శకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. అయితే తెలుగు లో వచ్చిన సినిమాని రీమేక్ చేసి దాన్ని మళ్లీ తెలుగులోకి డబ్బింగ్ చేసి అందించటం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
మల్కాపురం శివ కుమార్ తెలుగు డబ్బింగ్ రైట్స్ దక్కించుకోగా, జూన్‌లో మూవీ విడుదల చేయనున్నారు. అయోగ్య చిత్రం చివరి గంటలో వచ్చే సీన్స్ అన్నింటిని పూర్తిగా మార్చేశారట. ఇవి తెలుగు ప్రేక్షకులకి కూడా మంచి వినోదం అందిస్తాయని భావిస్తున్న నేపథ్యంలో అయోగ్య చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.