‘టెంప‌ర్’ తమిళ రీమేక్ ఫస్ట్ లుక్ (పోస్టర్) ఇదిగో

ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ చిత్రం తెలుగులో మంచి హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. పూరి మార్క్ స్టైల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ కరెప్టెడ్ పోలీసు అధికారిగా నటించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో రణ్‌వీర్‌సింగ్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు తమిళంలో కూడా ఈ చిత్ర రీమేక్ హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది.

భారీ మొత్తానికి హక్కులు స్వంతం చేసుకున్న విశాల్, ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విశాల్ సరసన హీరోయిన్‌గా రాశీఖన్నాను ఎంపిక చేశార . వెంకట్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో విశాల్ టెంపర్‌ కు సంభందించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. మీరు ఇక్కడ ఆ పోస్టర్ ని చూడవచ్చు.

టెంపర్‌ రీమేక్‌ చేయడానికి కారణం చెప్తూ విశాల్… ప్రస్తుతం సమాజంలో జరిగే మీటూ వంటి ఘటనలకు కనెక్ట్‌ అయ్యేలా ఉండే సినిమా ఇది. తెలుగుకి.. తమిళ్‌కి మార్పులు చేసి ‘అయోగ్య’ పేరుతో రీమేక్‌ చేయబోతున్నాం. ఎన్టీఆర్‌ చేసిన పాత్రలు, సినిమాలు పది, పదిహేను సంవత్సరాలు ఇంపాక్ట్‌ ఉంటుంది. కాబట్టి ఎన్టీఆర్‌ పెర్ఫామెన్స్‌ను ఈక్వల్‌ చేసి నటిస్తానని అనుకోవడం లేదు.

సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌, రేప్‌ జరిగినప్పుడు ఎలాంటి న్యాయం కావాలనే దానిని సినిమాగా చూపించిన తీరు ఎంతో బాగుంటుంది. నేను కూడా సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అన్నారు. అలాగే ‘మిర్చి, అత్తారింటికి దారేది’ వంటి సినిమాలు రీమేక్ కోసం అడిగారు. అయితే అప్పటికే ఉన్న కమిట్‌మెంట్స్‌ కారణంగా చేయలేకపోయాను. మంచి సామాజిక కారణం ఉండటంతో టెంపర్‌ రీమేక్‌లో నటిస్తున్నాను అని చెప్పారు.