‘వినయ విధేయ రామ’కు థియేటర్లు పెంపు !

రామ్ చరణ్, బోయపాటి శ్రీనుల ‘వినయ విధేయ రామ’ చిత్రం మొదటి రోజు గొప్ప టాక్ రాకపోయినా పండుగ సీజన్ కావడంతో మంచి వసూళ్లను రాబడుతోంది. నిన్న అనేక చోట్ల సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడిచింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘వినయ విధేయ రామ’ . జనవరి 11న విడుదలై స్పెషల్ షో ల నుండే డివైడ్ టాక్ తెచ్చుకున్న కూడా మొదటి రోజు 26కోట్ల షేర్ ను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమా డిజాస్టర్, పరమ చెత్త అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న యాంటి ఫ్యాన్స్ కు షాకిచ్చేలా ఇప్పుడు మరో ఫీట్ చేసింది. ఈ సినిమా ధియోటర్స్ పెంచటం జరిగింది.

‘వినయ విధేయ రామ’ ప్లాఫ్ కు కారణం చరణ్ మాటల్లో….

ప్రేక్షకుల కోరిక మేరకు..ఈస్టో గోదావరిలోని మండపేట వంటి కొన్ని ప్రాంతాలతో పాటు, అనంతపూర్, ఉత్తరాంధ్రలోని కొన్ని ఏరియాల్లో థియేటర్లు, షోల సంఖ్య పెంచారు. ఈరోజు కూడా సాయంత్రం వరకు అనేక చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నట్లు ఉన్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.

ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మామూలుగా హిట్ టాక్ తో కలెక్షన్స్ తేవటం కష్టమేమీ కాదని, ఇలాంటి దారుణమైన టాక్ ఉన్నా కలెక్షన్స్ ఎక్కడా డ్రాప్ లేదని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.