ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో ఫేక్ కలెక్షన్స్ తలనొప్పి ఎక్కువైపోయింది. ఈ మధ్యకాలంలో కలెక్షన్స్ ని కొంచెం ఎక్కువ చేసి చూపించడం అనేది సినిమా ప్రమోషన్ స్ట్రేటజీ మొదలెట్టి అది పరాకాష్టకు చేరుకుంది. దానికి తోడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్,యాంటి ఫ్యాన్స్ చేసే హడావిడితో ఏది నిజమైన కలెక్షన్స్, ఏది ఫేక్ అనేది స్పష్టత లేకుండా పోతోంది.
దాంతో సంచలన విజయం సాధించిన సినిమా వసూళ్లపై కూడా అనుమానాలు వ్యక్తమవుతుంటాయి.రిలీజ్ కు ముందే సినిమాపై దుష్ప్రచారం మొదలెట్టేస్తున్న బ్యాచ్ ఎక్కువైపోయింది. రిలీజ్ అయ్యాక ..ఏ మాత్రం టాక్ తేడా వచ్చినా సోషల్ మీడియాలో ట్రోలింగ్ వాళ్లకు దబిడి..దిబిడే అన్నట్లుగా సిట్యువేషన్ ఉంది.
తాజాగా ఈ పరిస్దితిని సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వినయ విధేయ రామ’ ఎదుర్కొంటోంది. డిజాస్టర్ టాక్‌తో ఈ చిత్రం ఫస్ట్ డే షేర్ ఆశ్చర్యపరుస్తోంది. నిజం చెప్పాలంటే ‘వినయ విధేయ రామ’ ఎదుర్కొన్నంత డిజాస్టర్ టాక్ ‘అజ్ఞాతవాసి’కి తప్ప ఈ మధ్యకాలంలో ఏ సినిమాకీ రాలేదన్నది నిజం. అయితే అంత టాక్ వచ్చినా కలెక్షన్స్ డ్రాప్ కాలేదంటూ వసూళ్లు మీడియాలో కనపడుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి 30 కోట్ల షేర్, 45 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంటూంటే…. సోషల్ మీడియా మాత్రం అంత సీన్ లేదు.. 16 నుండి, 18 కోట్లలోపే షేర్ వచ్చిందనీ మిగతాదంతా ఫేక్ అని మరికొందరు ప్రచారానికి తెర లేపారు. దాంతో ఏ కలెక్షన్స్ నిజం..ఏది అబద్దం అనే సందిగ్దంలో సామాన్య అభిమానులు ఉండే పరిస్దితి వచ్చింది.