ఒక్క పరాజయంతో దిగి వచ్చిన విజయ్, పూరితో సినిమా?

అర్జున్ రెడ్డి తో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన దేవరకొండ క్రేజ్ అటు తర్వాతా మరో రెండు సినిమాల వరకు కొనసాగినా ‘డియర్ కామ్రేడ్’ సినిమా పరాజయం పాలయ్యేసరికి వాస్తవానికి వచ్చినట్టు ఉన్నాడు. అది వరలో విజయంలో ఉన్నప్పుడు ఎవరినీ లెక్కచేయలేదనీ యాటిట్యూడ్ చూపించాడనీ అందరూ మొహం మీదే అనడం మొదలు పెట్టారు. దాంతో ఇప్పుడు మళ్ళీ తప్పక హిట్ కొట్టాల్సిన పరిస్థితి.

దాంతో ఇది వారికి కాదనుకున్న సినిమా సూపర్ హిట్ అయ్యేసరికి మళ్ళీ ఆ దర్శకుడిని కలిసాడు విజయ్. అది ఎవరో కాదు పూరి జగన్నాధ్. కానీ ఆయన ఇవేమీ పట్టించుకోకుండా కలిసి సినిమా చేద్దామంటూ అవకాశం ఇచ్చారట. అవును వీరి కలయికలో సినిమాను త్వరలోనే ప్రకటించనున్నారు. విజయ్ యాటిట్యూడ్ కు పూరి మాస్ మేకింగ్ కలిస్తే రచ్చ రచ్చే అనుకుంటున్నారు విజయ్ అభిమానులు