‘బాహుబలి’ నిర్మాతతో విజయ్ దేవరకొండ చిత్రం

ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం ‘బాహుబలి’ . ఆ నిర్మాతలు టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారిన విజయ్ దేవరకొండ తో సినిమా ప్లాన్ చెయ్యబోతున్నారా అంటే..అవుననే వినపడుతోంది. రీసెంట్ గా ‘బాహుబలి’ నిర్మతా శోభు యార్లగడ్డ..ట్వట్టర్ లో విజయ్ అభిమానులకు ఇచ్చిన రిప్లైలలో ఈ విషయం బయిటపడింది. విజయ్ దేవరకొండ అభిమానులు..ఆయన్ను..ఎప్పుడు తమ హీరో తో సినిమా చెయ్యబోతున్నారని అడిగారు. దానికి ఆయన తాను వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. అంటే ఆయన మనస్సులో ఆ ఆలోచన ఉందనేగా అర్దమవుతోంది.

ఇక విజయ్ దేవరకొండ..అర్జున్ రెడ్డి సినిమాతో తనలోని విలక్షణ నటుడిని మనందరికీ పరిచయం చేశాడు. ఈ చిత్రంలో తన పాత్రకున్న ఆటిట్యూడ్ వల్ల యూత్ కి తెగ నచ్చేసి ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా తరువాత నటించిన సినిమాల్లో మహానటి కూడా బాగా క్లిక్ అయ్యింది. ఇందులో జర్నలిస్ట్ మధురవాణికి సహాయకుడిగా విజయ్ ఆంటోని పాత్రలో కనిపించి అలరించారు. మూడు నెలల క్రితం విడుదలైన గీతా గోవిందం సైతం పెద్ద హిట్ అయ్యింది.

ఆ మధ్య లో వచ్చిన నోటా కొద్దిగా దెబ్బ కొట్టినా…టాక్సీవాలా హిట్ మళ్లీ ట్రాక్ ఎక్కించేసింది. విడుదలకు కొన్ని రోజుల ముందే పైరసీకి గురై ఇంటర్నెట్లో దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ కొత్త చిత్ర్రం ‘టాక్సీవాలా’ అన్ని అడ్డంకుల్ని ఎదుర్కొని నిన్ననే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దేవరకొండ స్టార్ డమ్, సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాల కారణంగా మొదటిరోజు ఓపెనింగ్స్ మంచి స్థాయిలోనే లభించాయి. ఆ తర్వాత సినిమాకు హిట్ టాక్ వచ్చి రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ తెచ్చేసుకుని, విజయ్ దేవరకొండ స్టామినా ఏంటో చూపించింది.

ఆ ఊపులో విజయ్ ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. భరత్ కమ్మ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. టైటిల్ చూస్తుంటే విప్లవాత్మకమైన చిత్రమంగా హింట్ ఇస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.