విజయ్ దేవరకొండ కొత్త కష్టాలు !  

టాలీవుడ్‌ సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త లుక్ కోసం హెవీ వర్కౌట్స్ చేస్తున్నాడట. లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ లో విజయ్ తన ఫైటర్ సినిమాలోని పాత్ర కోసం కొన్ని కష్టతరమైన వర్కౌట్స్ చేస్తూ తన లుక్ ను కూడా మారుస్తున్నాడట. నిజానికి విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. అలాంటి టైంలో ఫైటర్ సినిమా వచ్చింది. అందుకే ఈ సినిమా కోసం బాగా కష్ట పడుతున్నాడు. తన బాడీతో పాటు హెయిర్ స్టైల్ ను మార్చడంతో పాటు న్యూ లుక్ కోసం స్కిన్ టోన్ ను కూడా లైట్ గా మార్చే జెల్ ను వాడుతున్నాడట. మొత్తానికి ఫైటర్ కోసం అండ్ తన న్యూ లుక్ కోసం విజయ్ దేవరకొండ కొత్తగా బాగానే కష్టాలు పడుతున్నాడు.

ఏమైనా తన యాట్యిటూడ్ తో యూత్ లో బలమైన ముద్రను వేయగలిగింది ఈ జనరేషన్ లో ఒక్క విజయదేవరకొండే. ఫ్యాషన్ ప్రపంచానికి రౌడీ బ్రాండ్ తో స్టైయిల్ స్టెట్మెంట్ గా మారిన క్రెడిట్ కూడా విజయ్ కే దక్కుతుంది. ఇక డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తోన్న ఈ ‘ఫైటర్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎలివేట్ అవ్వబోతున్నాడు. ఈ చిత్రాన్ని అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి భారీగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అసలు ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించే కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చాడు.

ఈ సినిమా గనుక విజయ్ దేవరకొండకు భారీ హిట్ ను ఇస్తే.. విజయ్ రేంజ్ మరింతగా పెరిగిపోతుంది. ఇప్పటికే నాని లాంటి ఏవరేజ్ హీరోలను దాటేసిన విజయ్, ఆ తరువాత స్టేజికి వెళ్తాడు. మరి చాల కాలం తరువాత ఇస్మార్ట్ శంకర్ మూవీతో భారీ విజయాన్నే నమోదు చేసిన పూరి జగన్నాథ్ అదే ఊపుతో… ఈ సినిమాతో కూడా సెన్సేషనల్ స్టార్ కి భారీ హిట్ ను ఇస్తాడేమో చూడాలి. ఇక ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.