(ధ్యాన్)
గీత గోవిందం` సినిమా పబ్లిసిటీ బాధ్యతల్లో, పబ్లిసిటీ క్రెడిట్‌లో గీతా ఆర్ట్స్ టీమ్‌కి ఎంత షేర్ ఉందో, హీరో విజయ్ దేవరకొండకు కూడా అంతే షేర్ ఉంది. ఈ సినిమా ప్రమోషన్లలో విజయ్ ఎగ్రెసివ్‌గా పాల్గొన్నాడు. చివరకు తాను పాడిన పాట బాగోలేదని నెటిజన్లు ట్రోల్ చేస్తే వాటిని కూడా తెచ్చి పబ్లిసిటీకి వాడేశాడని, ఇన్ని ప్రమోషన్ తెలివి తేటలను తాను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని అల్లు అరవింద్ స్వయంగా స్టేజ్ మీద ప్రకటించాడు. తెలంగాణ సూపర్ స్టార్ స్థాయికి ఎదగడానికి ఒక్కో మెట్టూ ఎక్కుతున్న విజయ్ దేవరకొండ తాజాగా మరో పబ్లిసిటీ గేమ్ మొదలుపెట్టాడన్నది నెటిజన్ల అభిప్రాయం. ఇంతకీ అదేంటంటారా… అక్కడికే వస్తున్నాం. ఆయన నటించిన `గీత గోవిందం` సినిమా విడుదలై వారం పూర్తయింది. ఈ వారం వచ్చిన సినిమాల్లోనూ పెద్దగా ఆడేసి, కలెక్షన్లు దోచేసే సినిమాలు కనిపించడం లేదు. సో ఎలాగైనా ఇంకోసారి వార్తల్లో నిలుచుని పబ్లిసిటీని పెంచుకుంటే తప్పకుండా ఉపయోగం ఉంటుందని విజయ్ ఫీలింగ్. అందుకే ఆయన తాజాగా `మహర్షి` సెట్లో మహేష్‌ని కలిశారు. ఆల్రెడీ మెగా కాంపౌండ్ మొత్తం `గీత గోవిందం` సినిమాను భుజాలకు ఎత్తుకుని మోసేసింది. సో ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ ని చిల్ చేయడం కోసమే విజయ్ ఆ సెట్‌కి వెళ్లినట్టు అందరూ అనుకుంటున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి మహేష్ ట్విట్టర్‌లో తన పీలింగ్స్ ని పోస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే. అయినా ఇప్పుడు ఇంకోసారి విజయ్ తనవంతు పబ్లిసిటీ చేశారు. మహేష్ ఆ పోస్ట్ పెట్టినందుకు మర్యాదపూర్వకంగా వెళ్లి మహేష్‌ని కలిసినట్టు తెలుస్తోంది.