విజ‌య్ దేవ‌ర కొండ అనుకున్న‌దొక్క‌టి…అయ్యిందొక్క‌టి!

                                                                     (ధ్యాన్) 

యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో విజ‌య్ దేవ‌ర కొండ ఒక‌రు. ఈ హీరో కాస్త ఓపెన్‌గా మాట్లాడుతుంటాడు. “చిన్న‌ప్పుడు నువ్వు ఏమ‌వుతావ‌ని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే.. మ‌నం ఏదో ఒక స‌మాధానం చెబుతుంటాం. కానీ ఊహ తెలిసిన త‌ర్వాత మ‌న ఆలోచ‌న‌లు మారొచ్చు“ నాకు కూడా అంతే. అనుకుందొక‌టి.. అయ్యుందొక‌టి అంటున్నాడు. ఇంత‌కు ఈ హీరో ఏం కావాల‌న‌కున్నాడో తెలుసా.. ఓ క్లాత్ బిజినెస్ పెట్టాల‌నుకున్నాడ‌ట‌. అది కూడా ఏడో త‌ర‌గ‌తి చ‌దివే స‌మ‌యంలో త‌న స్నేహితుడితో కలిసి ఈ ఆలోచ‌న చేశాడ‌ట‌. త‌న క్లాత్ కంపెనీకి `లావా` ..ఫీల్ ద హీట్ అనే అనే పేరు కూడా అనుకున్నాడ‌ట‌. అయితే పెద్దయిన త‌ర్వాత హీరో కావాల‌నుకుని నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌… అదీ సంగ‌తి..