తమ్ముడు సినిమా కోసం గట్టిగా కష్టపడుతున్న విజయ్.!

విజయ్ దేవరకొండ పేరు తెలియని టాలీవుడ్ ఆడియెన్ ఎవరూ ఉండరు అంటే అతి ఏమీ కాదు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత నుంచి ఇపుడు పాన్ ఇండియన్ సినిమా చేసే రేంజ్ కి తక్కువ సమయంలోనే వచేసాడు విజయ్. టాలీవుడ్ రౌడీ బాయ్ గా స్థిరపడ్డ ఈ యంగ్ హీరో తర్వాత తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ని కూడా మెల్లగా హీరోని చేసాడు. మరి ఇప్పుడు ఆనంద్ నటించిన తాజా సినిమా “పుష్పక విమానం” కోసం మాత్రం గట్టిగానే కష్టపడుతున్నాడని చెప్పాలి.

ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ప్రమోషన్స్ ని ఈ సినిమాకి చేస్తున్నాడు. డైరెక్ట్ తానే రంగంలోకి దిగి తమ్ముడు కోసం ఎంత వీలయితే అంత సమయం ఇచ్చేస్తున్నాడు. లేటెస్ట్ గానే సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ తో ఇంటరాక్ట్ అయ్యి సినిమాపై మరింత బజ్ తెచ్చాడు. మరి ఇంతలా హంగామా చేస్తున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో..?