విజయ్ 65వ ప్రాజెక్ట్ పై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు సన్ పిక్చర్స్ నిర్మాతలు. గత కొంతకాలంగా విజయ్ మాస్టర్ అనంతరం ఎవరితో వర్క్ చేయబోతున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్ గా ఈ స్టార్ హీరో మురగదాస్ ను కాదని యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మురగదాస్ తో తుపాకి వంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం సర్కార్ అనే సినిమా చేసిన దళపతి ఓపెనింగ్స్ పరవలేదనిపించినప్పటికి అనుకున్నంత రేంజ్ లో అయితే హిట్ అందుకోలేకపోయాడు.
ఇక అదే కాంబోలో సన్ పిక్చర్స్ మరో సినిమాను నిర్మించేందుకు సిద్ధమైనట్లు లాక్ డౌన్ లో చాలా వార్తలు వచ్చాయి. తుపాకి సీక్వెల్ అంటూ వచ్చిన కథనాలపై కూడా మురగదాస్ క్లారిటీ ఇచ్చాడు. అలాంటిదేమి లేదని ఈ సారి ఫ్రెష్ కథతో రాబోతున్నట్లు చెప్పడంతో త్వరలోనే సినిమాపై అఫీషియల్ గా క్లారిటీ వస్తుందని అంతా బావించారు. కానీ ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. కథపై అంతగా సంతృప్తి చెందకపోవడంతో మురగదాస్ కూడా మార్చడం ఇష్టం లేక తప్పుకున్నాడట.
ఇక ఇప్పుడు సన్ పిక్చర్స్ విజయ్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 65వ సినిమాను నిర్మించాలి కాబట్టి ఇతర దర్శకులతో చర్చలు జరపగా ఫైనల్ గా నెల్సన్ దిలీప్ కుమార్ అనే యువ దర్శకుడు కథతో మెప్పించడం జరిగిందట. నయనతార కొలమాను కోకిల, శివకార్తికేయన్ డాక్టర్ సినిమాలతో హిట్స్ అందుకున్న దిలీప్ విజయ్ కు ఒక మాఫియా బ్యాక్ డ్రాప్ కథను వివరించినట్లు సమాచారం. కథ నచ్చడంతో సింగిల్ సిట్టింగ్ లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట విజయ్. ఇక కొద్దిసేపటి క్రితమే సన్ పిక్చర్స్ ఒక వీడియో ద్వారా ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చింది.