Vijay’s Beast : ఇన్సైడ్ టాక్ : విజయ్ “బీస్ట్” ఫలితం ఈ అంశం పైనే ఆధారపడి ఉందా.?

Vijay’s Beast : తమిళ బిగ్ స్టార్ థలపతి విజయ్ జోసెఫ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “బీస్ట్” పై భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.
దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా విజయ్ క్రేజ్ మరియు అనిరుద్ ల మాస్ స్కోర్ తో మంచి బజ్ నే తెచ్చుకుంది.
అయితే ఈ సినిమా కాన్సెప్ట్ పరంగా మాత్రం ఆడియెన్స్ లో అంత హైప్ లేదన్న మాట మాత్రం వాస్తవం. సింపుల్ కాన్సెప్ట్ తోనే సినిమా కనిపిస్తున్నా ఈ సినిమాని గట్టెక్కించేది మాత్రం ఒక్క అంశం మాత్రమే అని తమిళ్ ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
ఆ అంశమే ఈ సినిమా స్క్రీన్ ప్లే అట.
నెల్సన్ తన సినిమాల్లో సాలిడ్ స్క్రీన్ ప్లే చూపిస్తాడు కాకపోతే ఇది చాలా సింపుల్ స్టోరీ లైన్ కావడం మూలాన తన స్క్రీన్ ప్లే తో సినిమాని ఎలా చూపించాడు అనేదే ఆసక్తిగా మారింది. అంతే కాకుండా దీని మూలానే సినిమా ఫలితం కూడా చాలా వరకు ఆధార పడి ఉందని టాక్.
మరి రేపు వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.