వామ్మో…ఎన్టీఆర్ కోసం విద్యాబాల‌న్‌కు అంత డబ్బా???

ఎన్టీఆర్ బయోపిక్ క్వాలిటీ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు ఆ సినిమా బృందం. ఎంత ఖర్చైనా పర్లేదు కానీ మంచి ఔట్ పుట్ ఇవ్వాలి అని క్రిష్ కి నిర్మాతలు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా హైప్ కోసం బాలీవుడ్ తార విద్యాబాలన్ ని కూడా దించేసాడు క్రిష్. ఈ సినిమాలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్ర పోషిస్తుండగా, విద్యాబాలన్ బసవ తారకం క్యారెక్టర్ చేస్తోంది. అందుకోసం ఆమెకి భారీ పారితోషికంతో కూడిన చెక్ కూడా అందిన‌ట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో నటించటానికి విద్యాబాలన్ తీసుకున్న రెమ్యూనరేషన్ అక్షరాలా కోటి యాభై లక్షల రూపాయలు. కెరీర్ ఫామ్ లో ఉన్నప్పుడు ఇంత తీసుకోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఆమె అగ్రతారల జాబితాలో లేరు అలాగే ఈ నటి బాలీవుడ్ లో కూడా పెద్దగా సినిమాల్లో నటించట్లేదు. అలాంటప్పుడు ఇంత భారీ పారితోషకం తీసుకోవటం భారీ న్యూసే. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మూవీ టీమ్ ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.