(ధ్యాన్)
స్టార్ హీరోలు, దర్శకులు తమ గొంతుకలను అరువు ఇవ్వడం అనేది కామన్‌గా జరగుతుంది. అరువు ఇవ్వడం అంటే వాయిస్ ఓవర్ చెప్పడమే..ఇప్పుడు నితిన్ కోసం విక్టరీ వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. వివరాల్లోకెళ్తే.. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన మల్టీస్టారర్ `సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు` సినిమాలో పెద్దోడుగా విక్టరీ వెంకటేశ్, చిన్నోడుగా సూపర్‌స్టార్ మహేశ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్‌డూపర్ హిట్ అయింది. అప్పటి నుండి ఈ సంస్థతో ఇద్దరి ప్రత్యేక అనుబంధం కొనసాగుతుంది. ఈ ఏడాది ఇదే బ్యానర్‌లో పెద్దోడు విక్టరీ వెంకటేశ్ `ఎఫ్ 2`లో నటిస్తుండగా.. చిన్నోడు సూపర్‌స్టార్ మహేశ్ తన 25వ సినిమా చేస్తున్నారు. అదే అనుబంధంతో ఈ బ్యానర్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `శ్రీనివాస కళ్యాణం` తమ సపోర్ట్‌ను అందించారు. ఈ చిత్రం కోసం వెంకటేశ్ తన వాయిస్ ఓవర్‌ను ఇవ్వగా.. మహేశ్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.