తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తాండ’తెలుగులో రీమేక్ అవుతోంది. బాలీవుడ్ దబాంగ్ చిత్రాన్ని ఇక్కడ మనవాళ్లు మెచ్చే విధంగా రీమేక్(గబ్బర్ సింగ్) చేసిన హరీష్ శంకర్ డైరక్టర్ కావటం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా టైటిల్‌ను, కాన్సెప్ట్ పోస్టర్‌ను హరీశ్ తాజాగా సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. సినిమాకు ‘వాల్మీకి’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు.
టైటిల్‌లోగో పోస్టర్ లో తుపాకీ, సినిమా రీల్ చిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తమిళంలో ఘన విజయం అందుకున్న ‘జిగర్తాండ’కు రీమేక్‌గా రాబోతున్న చిత్రం ఇది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఒరిజనల్ ల్ లోని కీ కంటెంట్ ని తీసుకుని తనదైన శైలిలో ఒరిజనల్ లో మార్పులు చేసి హరీష్ శంకర్ ఈ సినిమా చేస్తున్నారు తమిళంలో సిద్దార్ద హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ‘జిగర్‌తండ’. జిగర్‌తండ’ చిత్రాన్ని ఆల్రెడీ తెలుగులో ‘చిక్కడు దొరకడు’ టైటిల్ తో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో ఇప్పుడీ చిత్రం రీమేక్ చేయాలనే హరీష్ శంకర్ ఆలోచనతో ఇండస్ట్రీవాళ్లు ఆలోచనలో పడ్డారు.
‘జిగర్‌తండ’ చిత్రం ..సిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక యంగ్‌స్టర్ లైఫ్‌లో మొదలై రౌడీషీటర్స్ ప్రపంచాన్ని టచ్ చేస్తూ, మంచి లవ్‌స్టోరీ, కామెడీ క్యారెక్టర్స్ మధ్య ట్రావెల్ అయి చిత్రమైన మలుపులు తిరుగుతూ చివరికి ఎవరూ ఊహించని క్లయిమాక్స్‌లో ఎండ్ అవుతుంది. ఆడియన్స్ ఒక కొత్త అనుభూతిని కలిగించే ఒక మ్యూజికల్ గ్యాంగ్‌స్టర్ లవ్‌స్టోరీగా తెరకెక్కించారు.
రజనీతో పేట చిత్రం చేసిన డైరక్టటర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన సినిమా.. తమిళనాట విజయం సాధించడంతో పాటు ఇటీవల ఈ సినిమాలో విలన్ గా నటించిన బాబీ సింహాకు నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడీ సినిమా తెలుగు లో రీమేక్ కాబోతోండటంతో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది.