వాట్సప్ చాట్ బయటపెట్టేసింది.. యాంకర్ రవి గుట్టు విప్పిన వర్షిణి

Varshini counters on Anchor Ravi

యాంకర్ రవి వర్షిణి బుల్లితెరపై హిట్ పెయిర్. ఈ ఇద్దరూ కలిసి చేసిన షో బాగానే క్లిక్ అయింది. శ్రీముఖి రవి కలిసి చేసిన పటాస్‌ షోలోకి వర్షిణి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ షోలోకి శ్రీముఖి వెళ్లడంతో పటాస్ ‌లోకి వర్షిణి ఎంట్రీ ఇచ్చింది. అలా వర్షిణి రవి కలిసి ఆ షోను ఇంకా ముందుకు తీసుకెళ్లారు. అలా ఆ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. అయితే రవి వర్షిణి మధ్య తెరపై ఎంతటి క్లోజ్ నెస్ ఉంటుందో.. బయట కూడా అంతే స్నేహంగా ఉంటారు.

Varshini counters on Anchor Ravi
Varshini counters on Anchor Ravi

అలా అంత క్లోజ్‌గా ఉంటారు కాబట్టే.. ఎక్కడా ఎప్పుడూ కూడా బయటకు రాని వర్షిణి సోదరి కూడా రవి కోసం ఇంటర్వ్యూ ఇచ్చింది. వర్షిణి, ఆమె సోదరి కలిసి యాంకర్ రవి యూట్యూబ్ చానెల్‌కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అది బాగానే వైరల్ అయింది. సంథింగ్ స్పెషల్ అనే షో నుంచి వర్షిణి సోదరి రవికి ఫ్యాన్ అంటా. ఈ విషయాన్ని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. తాజాగా రవి వర్షిణి ఇద్దరూ కలిసి చేసుకున్న వాట్సప్ చాట్ బయటకు వచ్చింది.

తాజాగా వర్షిణి ఓ పోస్ట్ చేసింది. అందులో వర్షిణికి రవి చేసిన మెసెజ్‌లున్నాయి. రెండు మూడు సార్లు కాల్ చేసినా కూడా వర్షిణి ఆన్సర్ ఇవ్వనట్టుంది. అయితే వాయిస్ మెసెజ్ పంపిన రవి.. అందులో ఏదో చెప్పాడు. వర్షిణి కూడా ఓకే అంది. ఆ తరువాత మళ్లీ మెసెజ్ చేస్తూ.. హై హీల్స్ వేసుకోకు అంటూ వర్షిణిని బతిమిలాడాడు. సరే అంటూ వర్షిణి చెబుతూ ఓ ట్విస్ట్ ఇచ్చింది. దీన్ని ఇన్ స్టాలో పోస్ట్ చేస్తాను అని యాంకర్ రవికి షాక్ ఇస్తూ..పొట్టి వాళ్ల కష్టాలు అంటూ రవికి కౌంటర్ వేసింది.