ప‌వ‌ర్ స్టార్ టైటిల్ తో వ‌ర్మ సినిమా

రాంగోపాల్ వ‌ర్మ ఏం చేసినా? సంచ‌ల‌నే. కానీ అప్పుడ‌ప్పుడు కామెడీ కూడా అదే స్థాయిలో చేస్తాడు. అవును నిజ‌మే కదా. ఆయ‌న సినిమాల్లో ఎంత సీరియ‌స్ నెస్ ఉంటుందో? అప్పుడ‌ప్పుడు వ‌ర్మ సృష్టించే పాత్ర‌ల్లో అంతే కామెడీ కూడా ఉంటుంది. వాటిని సెటైరిక‌ల్ గా చూపించొచ్చు.అందులోనే సీరియ‌స్ ను చూపిస్తుంటాడు. తాజాగా వ‌ర్మ ప‌వ‌ర్ స్టార్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అందులో పాత్ర‌ల‌ను కూడా వెల్ల‌డించాడు. బ్రేకింగ్‌ న్యూస్‌… ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో నేను తీస్తున్న నా తదుపరి సినిమాకు పవర్ స్టార్‌ అని పేరు పెట్టాను అంటూ ట్విట‌ర్ లో పోస్ట్ చేసి ఈ విష‌యాన్ని రివీల్ చేసాడు.

ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారని తెలిపాడు. అలాగే పవర్‌ స్టార్‌ సినిమాలో ఆ పాత్రల పేర్లను అర్థం చేసుకున్న వారికి బహుమతులు మాత్రం ఇవ్వను’ అంటూ ప్రకటన చేశాడు. మ‌రి ఈ ప్ర‌క‌ట‌న‌లో వ‌ర్మ సీరియ‌స్ నెస్ ఎంతో తెలియ‌దు గానీ! ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌తో చీవాట్లు అయితే తింటున్నాడు. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌యోపిక్ అంటూ..వ‌ర్మ ఇలా హేళ‌న చేస్తున్నాడ‌ని ప‌వ‌న్ అభిమానులు మండిప‌డుతు న్నారు. పైగా ఆ సినిమాలో నాలుగు బ‌ర్రెలంటూ వ్యాఖ్యానించ‌డంతో అభిమానులు మ‌రింత‌గా మండిపోతున్నారు.

వ‌ర్మ పోస్ట్ పై ప‌వ‌న్ అభిమానులు ర‌క‌ర‌కాల కామెంట్లు..చీవాట్లు పెడుతున్నారు. మ‌రి వీటిపై వ‌ర్మ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి. అస‌లే వ‌ర్మ‌-ప‌వ‌న్ అభిమానుల మధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే స్థాయిలో వివాదం ఎప్ప‌టి నుంచో ఉంది. ప‌వ‌న్ పై వ‌ర్మ సెటైరిక‌ల్ పోస్టులు…వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో వ‌ర్మ ప‌వ‌న్ అభిమానుల నుంచి ఎప్ప‌టి నుంచో విమ‌ర్శ‌లు ఎదుర్కోంటున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ప‌వ‌ర్ స్టార్ అని టైటిల్ తో సినిమా ప్ర‌క‌టించ‌డంతో ఆ వివాదం మ‌రింత ముదిరే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం వ‌ర్మ మిర్యాల‌గూడ ఘ‌ట‌న అమృత‌-ప్ర‌ణ‌య్ క‌థ‌ను ఆధారంగా చేసుకుని మ‌ర్డ‌ర్ టైటిల్ తో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.