సీనియర్ నటి వాణి శ్రీ కుమారుడు అభినయ్ వెంకటేశ్ కార్తీక్ గుండె పోటుతో మృతి చెందినట్లు తొలుత వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే అభినయ్ వెంకటేష్ కార్తిక్ గుండె పోటుతో కాకుండా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అభియన్ మెడకు బలమైన క్లాత్ ను తాడులా బిగువు చేసి ఉరి వేసుకున్నాడు. దానికి సంబంధించిన ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన చెంగల్ పట్టు జిల్లా తిరుక్కలికుండ్రలోని ఫామ్ హౌస్ లో చోటు చేసుకుంది. లాక్ డౌన్ కారణంగా ఫామ్ హౌస్ లోకి వెళ్లిన అభియన్ అక్కడ నుంచి ఎటు వెళ్లలేకపోయాడు.
దీంతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాధమిక దర్యాప్తు ద్వారా వెల్లడించారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. శవా పరీక్ష నిమిత్తం మృత దేహాన్ని పోలుసులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ మరో అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. తొలుత గుండె పోటు అని కథనాలచ్చాయి. ఆ సమాచారం ముందుగా మీడియాకి ఎలా ఎక్కిందన్నది ఆసక్తికరం. అటుపై కొన్ని గంటలకే ఇది ఆత్మహత్యగా పోలీసులు చెబుతున్నారు. ఇలా రకరకాల కథనాల నడుమ అభినయ్ ది ఆత్మహత్య? హత్య? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. వీటన్నింటికి బధులు దొరకాలంటే శవ పరీక్ష అనంతరం పోలీసులు మరోసారి నిర్ధారించాల్సి ఉంటుంది. దీనికి సంబధించి కుటుంబ సభ్యులు ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
అభినయ్ బెంగుళూరులోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవలే లాక్ డౌన్ కారణంగా ఇంటికి వెళ్లాడు. ఇంతలోనే మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. వాణీశ్రీ కి ముగ్గురు కుమారులు కనాలన్నది కోరిక అట. కానీ అనారోగ్యం కారణంగా ఒక్కడితో సరిపెట్టుకున్నారు. ముగ్గురు కొడుకుల గుర్తుగానే అభినయ్ వెంకటేష్ కార్తీక్ అనే పేరును ఒక కుమారుడికే పెట్టుకున్నారు. కానీ ఆ కన్న తల్లికి 36 ఏళ్ల వయసులోనే పుత్రశోకాన్ని మిగిల్చాడు అభియన్. కొడుకు మరణంగా వాణి శ్రీ కన్నీరు మున్నీరవుతున్నారు.