3.15 గంట‌ల పాటు ఊపిరిని బంధించే గ్రేట్ మ్యాన్!

ప్రాణ‌శ‌క్తిని బంధించే ఏకైక నిర్మాత‌

క‌ళాబంధు టీఎస్సార్ లో కొన్ని కోణాలు మాత్ర‌మే బ‌య‌టి ప్ర‌పంచానికి తెలుసు. ఆయ‌న వేదికలెక్కితే తెలుగుతో పాటు సంస్కృతం ధారాళంగా ప్ర‌వ‌హిస్తుంది. ల‌క్ష‌లాది జ‌నం చూస్తుండ‌గానే మంత్రోచ్ఛార‌ణ‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తారు. త‌న‌లోని ఆధ్యాత్మిక కోణాన్ని ఈశ్వ‌రేచ్ఛ‌ను చెప్ప‌నిదే ప్ర‌సంగం ఉండ‌దు. ఐదు ద‌శాబ్ధాలుగా సినీప‌రిశ్ర‌మ సంబంధీకుడిగా క‌ళాబంధుగా ఆయ‌నకు ఉన్న ఇమేజ్ గురించి తెలిసిందే. 17 సెప్టెంబ‌ర్ ఆయ‌న 77వ‌ బ‌ర్త్ డే సంద‌ర్భంగా.. ఇన్నేళ్ల‌లో ఎవ‌రికీ చెప్ప‌ని ఓ కొత్త కోణం గురించి ఆయ‌న ఓపెన్ అయ్యారు.

ఆయ‌న రెగ్యుల‌ర్ గా మూడు ద‌శాబ్ధాలుగా యోగా- ధ్యానం చేస్తూనే ఉన్నారు. చిన్న‌ప్పుడు 2గం.ల పాటు ప్రాణాయామం చేశార‌ట‌. అలాగే ఇప్పుడు పెరిగిన వ‌య‌సుతో పాటే.. 3.15 నిమిషాల పాటు ప్రాణ‌శ‌క్తిని బంధించిన ఈశ్వ‌రుని ధ్యానిస్తాను అని చెప్పి షాకిచ్చారు.  ప్రాణాయామం.. భ‌త్రుక వంటివి చాలా ప‌వ‌ర్ ఫుల్. ప్రాణాయామం ఎవ‌రైనా ఐదు నిమిషాలు మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు. మూడు గంట‌లు ఎవ‌రూ చేయ‌లేరు. స్వామీజీలు అయినా చేయ‌లేరు అంత సేపు అని తెలిపారు. క‌ఠోర త‌ప‌స్సు చేస్తాను. చిన్న‌ప్ప‌టి నుంచి అల‌వాటు. చిన్న వ‌య‌సులోనే 2గం.లు ప్రాణాయామం చేసేవాడిని అని వెల్ల‌డించారు. అస‌లు ఆయ‌న వేదిక‌లెక్కి అంత లౌడ‌ర్ గా ఎందుక‌ని మంత్రం జ‌పిస్తారు? అంటే ఆ గుట్టు మొత్తం చెప్పేశారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌, పాజిటివ్ ఎన‌ర్జీ.. భ‌క్తి త‌త్ప‌ర‌త.. మంత్రంతో ధ్యానం ఇవ‌న్నీ ఆరోగ్యానికి చాలా ముఖ్యం అని తెలిపారు. సంస్కృతంతో త‌న అనుబంధం దృష్ట్యా మంత్రోచ్చార‌ణ చేస్తాన‌ని అన్నారు. అలాగే త‌న‌లో భ‌క్తి అంటే మామూలు భ‌క్తి కానే కాద‌ని అన్నారు.

“ప‌దిమందిని క‌ల‌వ‌డం.. అంద‌రితో బావుండ‌డం చాలా ముఖ్యం. చాలా మంది ఒత్తిడిలో.. దిగులుతో ఉంటారు. ఆందోళ‌న‌తో ఉంటారు. అవేవీ నాకు ఉండ‌వు. గంట పాటు వాకింగ్ చేస్తాను. నిరంత‌రం వేకువ‌ఝామున‌ ధ్యానం – ప్రాణాయామం .. అర్థ‌గంట పాటు క‌పాల బాతి చేయ‌డం అల‌వాటు“ అని ఆయ‌న ఆరోగ్య ర‌హ‌స్యం గుట్టు విప్పారు. భోజ‌నంలో నేను యావరేజ్. ఎక్కువ తిన‌ను.. త‌క్కువ తిన‌ను. డైటింగ్ చేయ‌ను. ఓవ‌ర్ గా తిన‌ను. మితాహారం ఇష్టం అని వెల్లడించారు.

మ‌నిషిలో రావాల్సిన మార్పు గురించి చెబుతూ.. “మ‌నిషికి కోపం వ‌స్తుంది. అయినా మ‌ర‌పు చాలా ముఖ్యం. త‌ప్పు చేసినా కోపం అన‌వ‌స‌రం. యువ‌త‌రానికి ఇదే నా సూచ‌న‌. యారొగెన్సీ వ‌ద్దు. స‌క్సెస్ ద‌క్కినా అది వ‌ద్దు. విజ‌యంలో ఉన్న‌వార‌ని అనుస‌రించండి. మీ రూపాన్ని మెయింటెయిన్ చేయ‌డం.. ప‌బ్లిక్ లో జాగ్ర‌త్త‌గా ఉండ‌డం చాలా ఇంపార్టెంట్. మీ కెరీర్ ఇంపార్టెంట్. దేవాల‌యాల‌కు వెళ్లాలి. ఏకాగ్ర‌త మ‌న‌తో ఉండాలి. విమానంలోనూ నేను ఏకాగ్ర‌త‌తో ఉంటాను. ఎక్క‌డైనా అది అంద‌రికీ ఉండాలి“ అని సూచించారు.

జ‌య‌సుధకు ఈ పుట్టిన‌రోజున అభిన‌య మ‌యూరి అవార్డు ఇస్తున్న టీఎస్సార్ ఈ కార్య‌క్ర‌మానికి సినీరాజ‌కీయ ప్ర‌ముఖులు విచ్చేస్తున్నార‌ని తెలిపారు. రాధిక‌, సుహానిసి, మోహ‌న్ బాబు, బ్ర‌హ్మానందం, వాణిశ్రీ‌, శార‌ద‌, జెమున‌, ప్ర‌గ్యా జైశ్వాల్, రోజా, బ్ర‌హ్మానందం త‌దిత‌రులు వ‌స్తున్నారు. 14 మంది ఎంపీలు, మంత్రులు వ‌స్తున్నారట‌.