మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. వరసగా పెద్ద హీరోలను డైరక్ట్ చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో తన సంపాదనని వరసపెట్టి పెట్టుబడులు పెడుతున్నారు. త్రివిక్రమ్ మొదటినుంచీ ఏది చేసిన చాలా ప్లానింగ్ తో చేస్తూంటారు . చాల జాగ్రత్తగా డబ్బులు మదుపు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే అతని సంపాదనతో హైదరాబాద్ లో భూములు కొన్నారు, ఒక ఇల్లు కట్టుకున్నారు తాజాగా ఒక థియేటర్ కి ఓనర్ కూడా అయ్యారని సమాచారం.
అందుతున్న సమాచారం బట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆరుకోట్లు పెట్టి ఈస్ట్ గోదావరి రాజానగరంలో ఓ థియేటర్ ను కొన్నారు. ఆ థియేటర్ ను ఈస్ట్ లోనే ఒకరికి నిర్వహణకు అప్పగించారు. రాయుడు థియేటర్ అనే దీన్ని లాస్ట్ ఇయర్ నే రిన్మోవేట్ చేసారు.
లాస్ట్ ఇయర్ ఈ థియేటర్ ని మూడున్నర కోట్లకు అమ్మడానికిరెడీ అయిపోయారు కానీ అప్పట్లో అది వర్క్ అవుట్ అవ్వలేదు. దాన్ని ఇప్పుడు త్రివిక్రమ్ 4.90 కోట్లకు కొన్నట్లు సమాచారం. అక్కడ లాండ్ కాస్ట్ నే 2.50 కోట్ల వరకు వుందని బాగానే గిట్టుబాటు అవుతుందంటున్నారు. అయితే ఇప్పుడు థియోటర్ బిజినెస్ అనేది పెద్దగా లాభసాటి వ్యాపారం కాదని, లేకపోతే ఆ థియోటర్ ని ఏ సురేష్ బాబో లేక అల్లు అరవిందో తీసుకునేవారిని, త్రివిక్రమ్ దాకా వచ్చేది కాదని అంటున్నారు.
ఇప్పటికే వి.వి.వినాయక్, తేజ వంటి దర్శకులు ఈ థియేటర్ బిజినెస్‌లో ఉన్నారు. త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నాడు.