`బిగ్ బాస్ 4` లో టాప్ ట్యాలెంట్ ఎంట్రీ

`బిగ్ బాస్-తెలుగు` కొత్త సీజన్ టీజర్ విడుదలైనప్పటి నుండి ఇంటి స‌భ్యులు ఎవ‌రెవ‌రు? అన్న ఆస‌క్తి అభిమానుల్లో నెల‌కొంది. ర‌క‌ర‌కాల ఊహాగానాలు వేడెక్కిస్తున్నాయి. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న ప‌లువురు సెల‌బ్రిటీల్ని స్టార్ మా వాళ్లు ఎంపిక చేశార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.
 

పోటీదారుల జాబితా విషయానికి వస్తే, శ్రద్ధా దాస్, యామిని భాస్కర్, హంసా నందిని పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయిట‌. వీళ్ల‌తో పాటు ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ బిగ్ బాస్ 4 సీజన్లో భాగం కావడం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. వీరితో పాటు తెలుగు ర్యాప్ సింగర్ నోయెల్ సీన్, ప్రముఖ జానపద గాయని మంగ్లీ కూడా సీజన్ 4 కోసం ఎంపిక కానుంద‌ని చెబుతున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో ఎవ‌రికి బెస్ట్ ఫాలోయింగ్ ఉంటే వారిని ఎంపిక చేస్తున్నార‌ట‌.

గత సీజన్లో స‌రైన‌ జనాదరణ లేని పోటీదారులపై విమర్శలు వచ్చినందున, ఈసారి జనాదరణ పొందిన వారిని మాత్ర‌మే తీసుకురావడానికి స్టార్ మా వాళ్లు ప్ర‌య‌త్నిస్తున్నారు. ర్యాప్ సింగర్ నోయెల్ సీన్ కూడా చాలా సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన నటుడు. అతను బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగుంజ్ కి స్నేహితుడు. అతను రాహుల్‌ను విజేతగా నిలిపేందుకు ఓట్ల కోసం పెద్ద ఎత్తున‌ ప్రచారం కూడా చేశాడు.

మంగ్లీగా ప్రసిద్ది చెందిన సత్యవతి రాథోడ్ ఫాలోయింగ్ అసాధార‌ణం. టెలివిజన్ యాంకర్ గా నటిగానూ సుప‌రిచితం. మంగ్లి తెలంగాణ పాటలకు దేశ‌విదేశాల్లో ఫాలోయింగ్ ఏర్ప‌డింది. వాటితో బోలెడంత ఫాలోయింగ్ పెంచుకుంది. పూర్తి పోటీదారుల జాబితా చివరి వరకు సస్పెన్స్ . ఇప్ప‌టికి నాగార్జున కొత్త సీజ‌న్ హోస్ట్ గా ఎంపికైన సంగ‌తి తెలిసిందే.