అభిమానం హద్దు మీరితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. మా హీరో గొప్ప అన్న దగ్గర నుంచి మొదలైన కథ పెద్ద యుద్ధానికే దారి తీసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అభిమాన సంఘాలు పేరిట పుట్టుకొచ్చే గొడవలు గురించి తెలిసిందే. ఇక సినిమాల రిలీజ్ సమయంలో….ఆడియో వేడుకల సమయంలో జరిగే తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులు ఎంతో మంది. ఇలాంటి ఘటనలు కేవలం అభిమానం హద్దు మీరడం వల్ల జరిగే తప్పదం మాత్రమే. ఆ అభిమానంలో అతి చేయకుండా! ఉంటే చాలు ప్రతీ హీరో అభిమాని క్షేమంగా ఉంటాడు. కానీ అది జరగదు. మరి ఈ మార్పు తీసుకు రాగలిగే సత్తా ఎంత మందిలో ఉంది! అంటే ఆ పని కేవలం ఇప్పటివరకూ ఒక్క హీరో మాత్రమే చేయగలిగాడని…అతనికి మాత్రమే సాధ్యమని ఓ కొరియోగ్రాఫర్ ఘంటా పథంగా చెబుతున్నాడు.
యాక్టింగ్ అనేది తమ ప్రెషోషన్ అని….వాళ్లకి అది తప్ప మరొకటి తెలియదని..మా కోసం మీరు చొక్కాలు చింపుకోవడం..కొట్లాటకు దిగడం ముర్కత్వం అని..మేము కోట్లు సంపాదించుకుని బాగానే ఉంటున్నాం…మీ ఇంట్లో తల్లిదండ్రులను చూసుకోండని… మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మా సినిమాలు చూడండని ఓ ఇంటర్వూలో విక్టరీ వెంకటేష్ ధైర్యంగా చెప్పారు. ఇదే మాట మిగతా హీరోలు ఎందుకు చెప్పరని ఓ యాంకర్ సదరు కొరియోగ్రాఫర్ ని అడిగితే అతనేమన్నాడంటే? వెంకటేష్ గారు కాబట్టి ఆ మాట అనగలిగారు. దమ్ముంటే మిగతా హీరోలని అలా అనమనండి. చస్తే అనరు. అలా అంటే వాళ్ల వ్యాల్యూ పడిపోతుంది. అభిమానులు తగ్గిపోతారు. సినిమా వాళ్లు అంటే ఇంతనే? అన్న చులకన భావన అభిమానుల్లో…ప్రజల్లో ఏర్పడుతుంది.
కొన్ని రాష్ర్టాల్లో అసలు సినిమా పరిశ్రమలే లేవు. సౌత్ లో పెద్ద ఇండస్ర్టీలు కోలీవుడ్, టాలీవుడ్ మాత్రమే. ఈ రెండు భాషల్లో మాత్రమే పనులు మానేసుకుని ప్రజలు సినిమాలు చూస్తారు. మిగతా చోట అలా ఉండదు. అంతెందుకు బాలీవుడ్ లో ఎక్కడా ఏ హీరోకి పెద్ద గా డై హార్డ్ ఫ్యాన్స్ ఉండరు. అలాగని అభిమానులు లేరని కాదు. ఉంటారు..కానీ అక్కడ ఓ పద్దతి..లిమిట్ అనేది ఉంటుంది. మనకిక్కడ అలా ఉండదు. ఆ హీరో కోసం అంత చేస్తాం..ఇంత చేస్తాం…రక్తాలు ఇస్తాం..ప్రాణాలిస్తాం అంటూ మూర్ఖత్వంగా ఉంటారు. ఆ మూర్ఖత్వం ఉన్నంత కాలం టాలీవుడ్ హీరోలకి ఎలాంటి ఢోకా లేదు. వాళ్లు కోటీశ్వర లు…బిలీయనీర్లు అవుతనే ఉంటారు. పేద అభిమాని మాత్రం నిరు పేద అభిమానిగానే మిగిలిపొతాడు. వాళ్ల గురించి గానీ…వాళ్ల కుటుంబాల గురించి గానీ ఏ హీరో ఆలోచించడు. అలా ఒక్క పవన్ కళ్యాణ్ ఆలోచించ గల్గాడు కాబట్టే రంగుల జీవితాన్ని వదిలేజి రాజకీయం అనే బురద గుంటలోకి దిగాడని బధులిచ్చారు.