సినిమాని ఎలా బిజినెస్ చేయాలో..ఎలా జనాల్లోకి తీసుకెళ్లాలో, పాజిటివ్ బజ్ ఎలా తెచ్చుకోవాలో చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి సురేష్ బాబు. చిన్న సినిమాలను తన బ్యానర్ పై రిలీజ్ చేస్తూ డిస్ట్రిబ్యూట్ మంచి పేరు తెచ్చుకుంటన్న ఆయన ఓ ప్రక్కన తన థియోటర్స్ కు ఫీడింగ్ చూసుకుంటున్నారు, అదే సమయంలో సినిమాలు రిలీజ్ చేస్తున్నారన్న పేరు తెచ్చుకుంటున్నారు. అందులో భాగంగా చేనేత రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన చింతకింది మల్లేశం బయోపిక్ ఈ నెల 21న విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే రిలీజైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకాగా బిజినెస్ ఆఫర్స్ కూడా బాగానే వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో సినిమాపై బజ్ ని ఇంకా పెంచేందుకు నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు పది రోజుల ముందుగానే ప్రీమియర్లు వేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు మీడియా ప్రతినిధులకు స్పెషల్ షో వేయబోతున్నారు.
ఈ మేరకు ఇన్విటేషన్స్ పంపేశారు. గతంలోనూ ఇదే తరహాలో తమ బ్యానర్ లో విడుదల చేసిన పెళ్లి చూపులు – కేరాఫ్ కంచేరపాలెంలకు ఫాలో అయిన స్ట్రాటజీ మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ దెబ్బకొట్టింది. ఇప్పుడు మల్లేశంకు అంతకు మంచి రెస్పాన్స్ వస్తుందనే ధీమా అయితే టీం లో కనిపిస్తోంది.
ప్రియదర్శి టైటిల్ రోల్ పోషించిన మల్లేశంకు రాజ్ ఆర్ దర్శకుడు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించగా ప్రియదర్శికి జోడిగా అనన్య నటించింది.