అందాల ముద్దుగుమ్మ రాశీఖన్నాలో మరో టాలెంట్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. నటించడమే కాదు.. పాట పాడి కూడా ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇంతకు ముందే తమిళ, తెలుగు భాషల్లో పాటలు కూడా పాడిందన్న సంగతి తెలిసిందే. జోరు సినిమాలో ఓ పాట పాడి అందర్నీ మెప్పించింది. తాజాగా రాశీ ఖన్నా పాడిన పాట నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అది కూడా మామూలుగా పాడలేదు.. గిటార్ ప్లే చేస్తూ అందర్నీ టచ్ చేసింది.
లాక్డౌన్‌లో రాశీఖన్నా గిటార్ నేర్చుకుంటూ తెగ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తనకు ఇష్టమైన పాటలను గిటార్ ద్వారా ప్లే చేయాలని ప్రయత్నిస్తున్నట్టు అప్పట్లో చెప్పుకొచ్చింది. ఇక తాజాగా హుషారు సినిమాలోని ఉండిపోరాదే స్యాడ్ వర్షన్‌ను గానం చేసింది. రాశీ అలా పాడుతూ ఉంటే కుర్ర హృదయాలు కరిగిపోయాయి. ప్రస్తుతం రాశీ పాడిన పాట, ఆ వీడియో రెండూ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు రాశీ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
పాట పాడిన వీడియోను షేర్ చేస్తూ.. ‘పాడటం నాకు ఎంతో ఇష్టం.. తెలుగు పాటల్లో నాకు ఎక్కువగా నచ్చిన పాటిది.. లిరిక్స్, ట్యూన్, సిద్ శ్రీరామ్ గొంతు వింటుంటే నా మొహం చిరునువ్వు విరుస్తుంది. అందుకే ఈ పాట పాడాలని, గిటార్‌పై ప్లే చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే మీ కోసం వీడియోను షేర్ చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. రాశీఖన్నా చివరగా వెంకీమామ, వరల్డ్ ఫేమస్ లవర్, ప్రతి రోజు పండగే వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.