పెళ్లాయ్యక మీ ఆవిడ గోకుతుంటే నేను గుర్తొస్తాను: పూరి

puri Jagannadh Comments Through Podcast

పూరి జగన్నాద్ ప్రస్తుతం తనదైన శైలిలో ప్రవచనాలు వల్లిస్తున్నారు. అయితే అవి ఎంత ఘాటుగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఎవ్వరూ నమ్మలేని నగ్న సత్యాలను ఒప్పుకోని నిజాలను పూరి తన స్టైల్లో అందరి ముందుకు తెస్తున్నాడు. పాడ్ కాస్ట్ ఆడియో ద్వారా పూరి తన మాటలను అందరి ముందు ఉంచుతున్నాడు. తాజాగా స్త్రీలు, పురుషుల గురించి వివరించాడు.

puri Jagannadh Comments Through Podcast ABout Women
puri Jagannadh Comments Through Podcast ABout Women

సెక్స్ విషయంలో అబ్బాయిలు ఎన్నో ఊహించుకుంటారు.. వాళ్లకు వాళ్లే మన్మథుడు అని ఫీలవుతుంటారు. సిగ్గు పడే అమ్మాయిలను చూస్తే ఇంకా రెచ్చిపోతాడు. వాళ్లకి తెలియంది ఏంటంటే.. అమ్మాయిలు ఫిజికల్‌గా వీక్ ఏమో గానీ.. సెక్సువల్‌గా చాలా స్ట్రాంగ్. సెన్సిటివ్‌గా కనిపిస్తారు కానీ చంపేస్తారు. ఆడదాని సెక్స్ ముందు ఏ మగాడూ నిలవలేడు. ప్రతీ అందగత్తె వెనుక ఒక అలిసిపోయిన మగాడు ఉంటాడు. బ్రతిమిలాడుకునే బాహుబలి ఉంటాడు.

మనం ఎప్పుడూ వారిపై విజయం సాధించలేం. నా మాట నమ్మకపోతే నీ కర్మ.రేపు పెళ్లి అయ్యాక మీ ఆవిడ గోకుతుంటే అటు తిరిగి పడుకుంటావ్ కదా.. అప్పుడు నేను గుర్తొస్తాను. సెక్స్ అంటే భయమేస్తది.. సరే నేను ఏం చెప్పినా నువ్ వినవు.. ఈ వయసులో నువ్ డిక్ మాటే వింటావ్..మెదడు పని చేయదు.. అయినా సరే వినడానికి ట్రై చేయండి.. చివరగా నేను చెప్పేది ఏంటంటే.. ఈ స్లోగన్ గుర్తు పెట్టుకోండి.. మనది మిషన్ గన్ కాదు. అంటూ కాస్త ఘాటు పదజాలంతోనే వివరించాడు.