Throw back బికినీలో గూఢ‌చారి పాప‌!

Throw back బికినీలో గూఢ‌చారి పాప‌!

తెలుగ‌మ్మాయిల‌కు టాలీవుడ్‌లో అవ‌కాశాలు త‌క్కువే. బాలీవుడ్ భామ‌ల్ని ప్రోత్స‌హించినంత‌గా తెలుగ‌మ్మాయిల్ని మ‌న వాళ్లు ప్రోత్స‌హించ‌రు అన్న‌ది చాలా ఏళ్లుగా వినిపిస్తూనే వుంది. అందుకే నేమో శోభితా ధూళిపాళ బాలీవుడ్‌కు బాట‌ప‌ట్టింది. ఈ తెనాలి పాప అనురాగ్ క‌శ్య‌ప్ రూపొందించిన సైకో థ్రిల్ల‌ర్ `ర‌మ‌న్ రాఘ‌వ్ 2.ఓ`తో వెండి తెర‌కు ఎంట్రీ ఇచ్చింది.

తొలి సినిమా సైకో థ్రిల్ల‌ర్ కావ‌డం, ఎక్స్‌పోజింగ్‌, ఎరోటిక్ సీన్‌ల‌కి అవ‌కాశం ఎక్కువ‌గా వున్నా ఒళ్లు దాచుకోకుండా న‌టించి తొలి సినిమాతోనే త‌ను దేనికైనా రెడీ అనే సంకేతాలిచ్చింది. వెండి తెర‌పై హాట్ హాట్ స‌న్నివేశాల్లో న‌టిస్తూ సెగ‌లు పుట్టిస్తోంది. తెర‌పైనే కాకుండా సోష‌ల్ మీడియాలోనూ ఘాటెక్కిస్తోంది. తెలుగులో `గూఢ‌చారి`తో ప‌రిచ‌య‌మై ఆక‌ట్టుకుంది.

తెలుగులో `మేజ‌ర్‌`, త‌మిళంలో మ‌ణిర‌త్నం తెర‌కెక్కిస్తున్న `పొన్నియిన్ సెల్వ‌న్‌` చిత్రంలో ఛాన్స్ ద‌క్కించుకుంది. మ‌ల‌యాళంలోనూ ఓ చిత్రంలో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం మూడు భాష‌ల్లో బిజీగా వుంది. ఇటీవ‌ల ఫొటో షూట్‌తో వార్త‌ల్లోకెక్కి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న శోభిత తాజాగా ఓ త్రో బ్యాక్ బికినీ పిక్చ‌ర్‌ని షేర్ చేసింది. బీచ్‌లో బికినీ ధ‌రించి అందాల విందు చేస్తున్న శోభిత ఫొటోలు ఇన్ స్టాని హీటెక్కిస్తున్నాయి.