మరో సారి వార్తల్లోకి పవన్ ‘తొలిప్రేమ’ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లవ్ ఎంటర్టైనర్ ‘తొలిప్రేమ’ ఎంత పెద్ద హిట్టో, ట్రెండ్ సెట్టరో మనందరికీ తెలిసిందే. అప్పట్లో వచ్చిన లవ్ స్టోరీ మూవీస్ లో ఈ సినిమా కొత్త ట్రెండ్ సృష్టించింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఈ చిత్రం కల్ట్ సినిమా గా మారింది. అంతేకాకుండా అంతులేని అభిమానం గల ఫ్యాన్స్ ని ఇస్తూ…ఓవర్ నైట్ లో పవన్ ను స్టార్ హీరో ను చేసింది ఈ చిత్రం.

1998 లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ ఎన్ని సార్లు టీవీ ల్లో వచ్చిన ఈ సినిమాకు ఇప్పటికి ఓ రేంజిలో రేటింగ్స్ వస్తాయి. ఇక తాజాగా ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా సొంతం చేసుకుంది. ఇంతకుముందు ఈచిత్రాన్ని జీ తెలుగు ప్రసారం చేసింది.

తొలి ప్రేమ చిత్రానికి పవన్ కళ్యాణ్ పారితోషకం 15 లక్షలు అని ఆ చిత్రం ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయి తెలిపాడు. అప్పట్లో 15 లక్షలు అనేది చాలా పెద్ద అమౌంట్. తమిళ దర్శకుడు ఏ కరుణాకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది. ఎస్ఎస్ సి ఆర్ట్స్ పతాకం ఫై జి వి జి రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవా సంగీతం అందించాడు.అప్పట్లో ఈ చిత్రం యొక్క ఆడియో కూడా సెన్సేషన్ సృష్టించింది.