“పుష్ప 2” కోసం రంగంలోకి దిగిన మరో హిట్ దర్శకుడు..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ టర్న్డ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ సినిమా “పుష్ప పార్ట్ 1” పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ హిట్ కాగా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సీక్వెల్ పుష్ప పార్ట్ 2 పై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ మరింత గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తుండగా ఇప్పుడు మరిన్ని ఆసక్తికర వార్తలు అయితే ఈ సినిమాపై బయటకి వస్తున్నాయి. టాలీవుడ్ లో సుకుమార్ కి చాలా మంది శిస్యులు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే వారిలో ఆల్రెడీ చాలా మంది స్టార్ దర్శకులు కూడా ఉన్నారు.

అలా తన ఫస్ట్ సినిమాతోనే భారీ హిట్ అందుకున్న దర్శకుడు “ఉప్పెన” ఫేమ్ బుచ్చిబాబు సానా పుష్ప 2 కోసం రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా స్క్రిప్ట్ లో సుకుమార్ కి సహకారం అందించేందుకు గాను బుచ్చిబాబు ఇప్పుడు పుష్ప 2 సెట్స్ లోకి దిగాడని తెలుస్తుంది.

అయితే గతంలో కూడా బుచ్చిబాబు పుష్ప 1 సమయంలో లేపిన రచ్చ కోసం అందరికీ తెలిసిందే. ఇక ఈసారి అయితే ఇంపాక్ట్ ఎలా కనబరుస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఫహద్ ఫాజిల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.