గాసిప్స్ : నిఖిల్ “కార్తికేయ 2” ఓటిటి లో రిలీజ్ ఎప్పుడు వస్తుంది అంటే.?

Karthikeya 2 movie review

ఈ ఏడాది టాలీవుడ్ సినిమాలో వచ్చిన హిట్స్ అన్నీ కూడా నార్మల్ హిట్స్ అయితే కాదని చెప్పాలి. వస్తే భారీ నష్టాలు లేకపోతే మూడింతలు రెండింతలు లాభాలు ఇచ్చిన సినిమాలే ఉన్నాయి. అలాంటి లాభాలు ఇచ్చిన లేటెస్ట్ సినిమాల్లో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచినటువంటి సినిమా “కార్తికేయ 2” కూడా ఒకటి.

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన కార్తికేయ కి సీక్వెల్ గా చేసిన ఈ సినిమా కొన్ని అడ్డంకులు నడుమే వచ్చినా పాన్ ఇండియా వైడ్ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఏకంగా 111 కోట్ల గ్రాస్ వసూలు చేసి సెన్సేషనల్ హిట్ గా ఈ సినిమా నిలవగా ఇంకా హిందీ మరియు ఓవర్సీస్ లో మంచి వసూళ్లతో రన్ కొనసాగిస్తోంది.

ఇక ఇదిలా ఉండగా థియేటర్స్ లో దుమ్ము లేపిన ఈ సినిమా ఓటిటి లో ఎప్పుడు వస్తుందో అనేది ఇప్పుడు గాసిప్స్ ద్వారా తెలుస్తుంది. మరి ఈ సమాచారం ప్రకారం అయితే ఈ చిత్రం రిలీజ్ ఈ సెప్టెంబర్ 30న ఉండొచ్చని అంటున్నారు.

అయితే ఈ సినిమా ఓటిటి రైట్స్ జీ 5 వారు తీసుకోగా ఇందులో ఈ డేట్ నుంచి అయితే రావచ్చని అంటున్నారు. ఇంకా ఈ సినిమాలో అయితే అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించారు.