బాబోయ్…అంటూ భార్యపై అనూహ్య వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్

ఫ్యాన్స్ కి తమ అభిమాన హీరోకి సంబంధించిన ప్రతి చిన్న అంశమూ చాలా స్పెషల్. వారికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవడంలో ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు. ఇంకా, వారి పర్సనల్ లైఫ్ విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం కూడా ఉంటుంది. వారి ఆసక్తిని సెలబ్రిటీస్ కూడా కాదనకుండా అప్పుడప్పుడు వారి అప్డేట్స్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.

పాత తరం నాయకులకు అప్పట్లో అభిమానులతో టైం స్పెండ్ చేసే అవకాశం తక్కువే… కానీ ఇప్పుడు టెక్నాలజీ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది. దీంతో సోషల్ మీడియా వేదికగా స్టార్స్, ఇంకా వారి ఫ్యాన్స్ చేరువగా ఉంటున్నారు. టాప్ హీరోస్ సైతం సోషల్ మీడియా ద్వారా వారి వ్యక్తిగత విషయాలను, కుటుంబ విషయాలను అప్పుడప్పుడు సరదాగా అభిమానులతో పంచుకుంటున్నారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు కూడా ఓపిగ్గా సమాధానాలు చెబుతున్నారు. ఇంకా వెసులుబాటు ఉంటే లైవ్ వీడియోస్ ద్వారా అభిమానులతో కనెక్ట్ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఒక విషయం రివీల్ చేశాడు. తన భార్య గురించి అడిగిన ప్రశ్నకు అనూహ్యంగా రెస్పాండ్ అయ్యాడు. యంగ్ టైగర్ నటించిన “అరవింద సమేత” అనే మూవీ అక్టోబర్ 11 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ముమ్మరం చేసింది చిత్ర బృందం. దీనిలో భాగంగా మూవీ టీమ్ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చిత్రానికి సంబంధించిన పలు విషయాలు మాట్లాడారు. ఈ తరుణంలో ఇంటర్వ్యూయర్ అడిగిన ఒక ప్రశ్నకు అనూహ్యంగా స్పందించారు ఎన్టీఆర్. “పిల్లలకు వండిపెట్టడంలాంటివన్నీ మీ భార్య ప్రణతినే చూసుకుంటారా?” అని అడుగగా ఆయన ఇలా రియాక్ట్ అయ్యారు. “బాబోయ్ ఏం మాట్లాడుతున్నారు మీరు? నా భార్య గురించి ఎక్కువ ఊహించుకుంటున్నారు. ఆమెకసలు వంట చేయడమే రాదు. ఒకవేళ వండినా తిని పారిపోవాలి అని నవ్వుతూ తెలిపారు.

మా ఇంట్లో నేను వంట బాగా చేస్తాను. నాకంటే అమ్మ ఇంకా బాగా వండుతారు. మేము వండి పెడితే తల్లీకొడుకులు (ప్రణతి, పిల్లలు) తిని కూర్చుంటారంతే… మా ఇంట్లో నేను ఆర్గ‌నైజ్డ్‌ గా ఉంటాను. రూమ్ చాలా నీట్ గా ఉండాలి నాకు. ప్రణతికి చిందరవందరగా ఉంటే ఇష్టం” అని తెలిపారు తారక్.