ఆ హీరోయిన్ మళ్లి మళ్లి మెగాస్టార్ తో… !

ఆ హీరోయిన్ మళ్లి మళ్లి మెగాస్టార్ తో… !

మెగాస్టార్‌ చిరంజీవి రీ ఎంట్రీలో సైతం యమస్పీడ్ గా దూసుకుపోతున్నాడు. ఖైదీ నంబర్‌ 150 తరువాత కాస్త గ్యాప్‌ తీసుకున్నమెగాస్టార్‌ , సైరా నరసింహారెడ్డి తరువాత మాత్రం అస్సలు గ్యాప్‌ ఇవ్వటం లేదు. సైరా ఇంకా వెలుగులోకి రాకముందే  మరో చిత్రాన్ని  సెట్స్ మీదకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా సన్నాహాలు  చేసుకుంటున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా శరవేగంగా  జరుగుతోంది.  తాజాగా హీరోయిన్‌ విషయంలోనూ అదే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సైరా సినిమాలో చిరుకు జంటగా నటించిన నయనతారనే మళ్ళీ  హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాను కూడా చిరు తనయుడు రామ్‌ చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. నయనతార  సైరా లో గొప్పగా నటించిందని, అందుకే మళ్లి మళ్లి ఈ అవకాశం ఆమెనే వరించిందని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. వహ్.. నాయన రియల్లీ గ్రేట్ అంటున్నారంతా!