‘బ్రాండ్ బాబు’ మూవీ పై కేసు నమోదు

తాజాగా విడుదలైన బ్రాండ్ బాబు మూవీ పై కేసు నమోదైంది.ఒక మహిళా జర్నలిస్ట్ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు ఈ సినిమాపై కేసు నమోదు చేసారు.ఈ సినిమాలో తన అనుమతి లేకుండా చనిపోయిన ఒక సన్నిహివేశంలో తన ఫోటోను చూపించారని భాదిత మహిళా జర్నలిస్ట్ కంప్లైంట్ చేసారు.ఆమె ఫిర్యాదు మేరకు యూనిట్ పై ఐసీసీ సెక్షన్ 509 కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసారు.

కన్నడ నటుడు సుశాంత్ శైలేంద్ర హీరోగా తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ తీసిన ఈ సినిమాను బుల్లితెర దర్శకుడిగా సుపరిచితుడైన ప్రభాకర్ దర్శకత్వం వహించారు.దర్శకుడు మారుతి ఈ మూవీ కథను సమకూర్చారు.